Assam: తీవ్రవాదులతో లింకులు.. మదర్సాలు కూల్చివేస్తున్న అసోం సర్కార్

Assam: అనుమానిత, ఉగ్ర‌సంస్థ‌ల‌తో సంబంధాలున్న మదర్సాపై అస్సాం సర్కార్ స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది.

Update: 2022-08-31 15:45 GMT

Assam: తీవ్రవాదులతో లింకులు.. మదర్సాలు కూల్చివేస్తున్న అసోం సర్కార్

Assam: అనుమానిత, ఉగ్ర‌సంస్థ‌ల‌తో సంబంధాలున్న మదర్సాపై అస్సాం సర్కార్ స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. తాజాగా బంగ్లాదేశ్ తీవ్రవాద సంస్థ అల్ కాయిదాతో సంబంధాలున్న బొంగైగావ్ జిల్లా కబితరీ గ్రామంలోని మార్క్‌జుల్ మా-ఆరిఫ్ క్వారియానా మదర్సాను బుధవారం కూల్చివేసింది. అలాగే అల్-ఖైదాతో సంబంధం ఉన్న ఇమామ్‌లు. మదర్సా ఉపాధ్యాయులతో సహా 37 మందిని అరెస్టు చేసింది. ఇదిలా ఉంటే గత రెండ్రోజులుగా ఇలాంటి అనుమానాస్పదంగా గుర్తించి రెండు మదర్సాలపై అస్సాం స‌ర్కార్ చర్యలు చేపట్టింది. తాజాగా మరో మదర్సాను కూల్చేయడంతో మూడు మదర్సాలు నేలమట్టమయ్యాయి. ఇక ఈ మదర్సా కూల్చివేతకు ముందు అందులో నుంచి విద్యార్థుల‌ను ఖాళీ చేయించి ఇతర విద్యాసంస్థలకు పంపించారు.

తాజాగా ఈ మదర్సాపై దాడులలో నిషేధిత రాడికల్ గ్రూపులకు సంబంధించిన ప‌లు పత్రాలు, ప్ర‌చార ప్ర‌తులు గుర్తించిన పోలీసులు తీవ్రవాదులతో సంబంధాలున్నాయన్న కారణంగా హఫిజర్ రెహమాన్ అనే మదర్సా టీచర్‌ను ఈ నెల 26న అరెస్ట్ చేయగా, గోల్పారా జిల్లాలో ఇద్దరు ఇమామ్‌లతో కలిసి ఇప్పటి వరకూ రాష్ట్రంలో 37 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ మదర్సాల కూల్చివేతలపై ముస్లిం మతపెద్దలు తప్పుబడుతున్నారు. ప్రభుత్వం కావాలనే ఇలాంటి ఉగ్రవాద సంస్థలతో లింకులుపెడుతో వేలమంది విద్యార్థులకు చదువులనందించే మదర్సాలను కూల్చేస్తోందన్నారు. ఇది ముమ్మాటికీ హేయమైన చర్యేన్నారు. ముందస్తు నోటీలివ్వకుండా కూల్చివేయడం సరికాదంటున్నారు. 

Tags:    

Similar News