కరోనా విజృంభణపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం.. అధికారులపై మర్డర్ కేసు పెట్టాలని ఆదేశం
Madras High Court: తమిళనాడులో కరోనా విజృంభణపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది
Madras High Court: తమిళనాడులో కరోనా విజృంభణపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా సెకండ్ వేవ్‌కు ఎన్నికల కమిషన్ కారణమన్న ధర్మాసనం అధికారులపై మర్డర్ కేసు పెట్టాలని ఆదేశించింది. బహిరంగ సభలు, ర్యాలీలు ఎందుకు ఆపలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రవాణా మంత్రి ఎం.ఆర్. విజయభాస్కర్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. ర్యాలీల సమయంలో మీరు వేరే గ్రహం మీద కాలక్షేపం చేస్తున్నారా అంటూ మండిపడింది. కౌంటింగ్ రోజు కచ్చితంగా కొవిడ్ రూల్ పాటించాలని ఆదేశింది. కౌంటింగ్ ఏర్పాట్లపై బ్లూ ప్రింట్ ఇవ్వాలన్న మద్రాస్ హైకోర్టు కౌంటింగ్‌పై ఎన్నికల కమిషన్ సరైన చర్యలు తీసుకోకపోతే ఎన్నికల ప్రక్రియ రద్దు చేస్తామని హెచ్చరించింది.