MP CM Shivraj Singh Chouhan tests corona Positive: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
MP CM Shivraj Singh Chouhan tests corona Positive: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం కరోనా భారిన పడ్డారు. ఈ విషయాన్నీ స్వయంగా శివరాజ్ సింగ్ చౌహాన్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు
MP CM Shivraj Singh Chouhan tests corona Positive: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం కరోనా భారిన పడ్డారు. ఈ విషయాన్నీ స్వయంగా శివరాజ్ సింగ్ చౌహాన్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కొన్ని రోజులుగా తనకు లక్షణాలు ఉన్నాయని.. అందులో పేర్కొన్నారు. తనతో పరిచయం ఉన్న సహోద్యోగులందరు పరీక్షలు చేయించుకొని.. నిర్బంధంలోకి వెళ్లాలని కోరారు. కాగా ఆయనకు ఇవాళ ఉదయం నిర్వహించిన కోవిడ్ -19 పరీక్షలో పాజిటివ్ అని తేలింది. దాంతో సీఎంకు వ్యక్తిగత వైద్యుల సిబ్బంది చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం సీఎం నివాసంలోనే శివరాజ్ సింగ్ చౌహాన్ ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది.
దేశంలో కరోనా సోకిన మొదటి ముఖ్యమంత్రి శివరాజ్ సింగే అవుతారు. ఆయన గత ఐదు నెలల కిందటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీని కోల్పోయిన కొన్ని రోజుల తరువాత.. శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలావుంటే మధ్యప్రదేశ్ క్యాబినెట్ మంత్రి అరవింద్ బడోరియాకు రెండు రోజుల కిందట కరోనా సోకింది. కరోనా లక్షణాలు ఉండటంతో అయన టెస్టులు చేయించుకున్నారు. టెస్టులలో ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో అయన హోమ్ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. మధ్యప్రదేశ్ కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది.