JEE, NEET Exams : జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించండి!
JEE, NEET Exams : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే... వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి రికార్డు స్థాయిలో కేసులు
JEE, NEET Exams : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే... వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కేసులతో కలిపి రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి..ఈ క్రమంలో సెప్టెంబర్ 1 నుంచి నిర్వహించాల్సిన జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలని ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విద్యావేత్తలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు వేశారు. పశ్చిమ్ బెంగాల్, ఝార్ఖండ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, పంజాబ్, మహారాష్ట్రలు ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడానికి అనుమతించవద్దని సుప్రీంకోర్టుని కోరాయి.
ఇక ఇది ఇలా ఉంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం అందుకు విరుద్దంగా ఎగ్జామ్స్ నిర్వహించాలని కోరారు.. పరీక్షలను వాయిదా వేయడం వలన విద్యార్దుల ఏడాది భవిష్యత్తు వృధా అవుతుందని అన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలను నిర్వహించాలని అయన సూచించారు. సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్స్, సెప్టెంబర్ 13న నీట్, జేఈఈ అడ్వాన్స్‌డ్ సెప్టెంబర్ 27న జరగబోతున్నట్టుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) షెడ్యుల్ ని విడుదల చేసింది.
NEET and JEE examinations must be conducted on time so that one year of our students doesn't get wasted. It is about their future: Madhya Pradesh Shivraj Singh Chouhan pic.twitter.com/qJb2dn7Ntt
— ANI (@ANI) August 28, 2020
ఇక అటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 77,266 కేసులు నమోదు కాగా, 1057మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 60,177మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 33,87,500 కేసులు నమోదయ్యాయి. ఇందులో యాక్టివ్ కేసులు 7,42,023 ఉండగా, 25,83,984 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 61,529 మంది కరోనా వ్యాధితో మరణించారు.