Shivraj Singh Chouhan Family Test Negative: సీఎంకు పాజిటివ్, కుటుంబసభ్యులకు నెగటివ్.. అయినా..
Shivraj Singh Chouhan Family Test Negative: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు శనివారం కోవిడ్ -19 కు పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన కుటుంబ సబ్యులకు కూడా పరీక్షలు చేశారు. వారి కోవిడ్ -19 పరీక్ష ఫలితాలు ఆదివారం వచ్చాయి.. శివరాజ్ సింగ్ చౌహాన్ సతీమణి సాధన, కుమారులు కార్తికేయ, కునాల్ కు వైరస్ నెగటివ్ అని వచ్చినట్లు అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్తగా, శివరాజ్ సింగ్ చౌహాన్ కుటుంబ సభ్యులను ఇంటి వద్ద 14 రోజుల నిర్బంధంలో ఉంచారు. అలాగే తమను ఇటీవల కలిసిన వారెవరైనా పరీక్షను తప్పనిసరిగా చేసుకోవాలని శివరాజ్ కుటుంబం విజ్ఞప్తి చేసింది. ఇక శివరాజ్ సింగ్ చౌహాన్ (61) ను భోపాల్ లోని ప్రైవేట్ ఆసుపత్రి అయిన చిరాయు ఆసుపత్రికి తరలించారు. ,మరోవైపు సిఎం ఏజ్ 60 దాటడంతో ఆయనకు ఆసుపత్రిలో అనేక ఇతర పరీక్షలు కూడా చేశారు. ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహన్ ఆరోగ్యం స్థిరంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.
కాగా శివారు కు శనివారం కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో స్వయంగా ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు సీఎం.. అందులో ఇలా పేర్కొన్నారు. 'నా ప్రియమైన ప్రజలారా, నేను COVID19 లక్షణాలను కలిగి ఉన్నాను, పరీక్ష తర్వాత నా నివేదిక సానుకూలంగా వచ్చింది. నా సహోద్యోగులందరికీ నేను ఎవరితో సంప్రదించినా, వారి కరోనా పరీక్షను చేయించుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు దగ్గరగా ఉన్న వ్యక్తులు ఐసోలేషన్ కు వెళతారు. నేను COVID19 యొక్క అన్ని మార్గదర్శకాలను అనుసరిస్తున్నాను. డాక్టర్ సలహా ప్రకారం నేను ఐసోలేషన్ లో ఉంటాను. జాగ్రత్తగా ఉండాలని నా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను' అని ట్విట్టర్ లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు.