మధ్యప్రదేశ్ లో బీజేపీ సర్కార్ వినూత్న పథకానికి శ్రీకారం

Mukhyamantri Udyam Kranti Yojana: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు.

Update: 2022-04-05 16:00 GMT

మధ్యప్రదేశ్ లో బీజేపీ సర్కార్ వినూత్న పథకానికి శ్రీకారం

Mukhyamantri Udyam Kranti Yojana: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి ఉద్యమ క్రాంతి యోజన పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్ లో భాగంగా రాష్ట్రంలో యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేస్తుందన్నారు శివరాజ్ సింగ్.

ఇందులో గరిష్టంగా యాభై లక్షల రూపాయల వరకు బ్యాంకు నుంచి రుణం ఇస్తారు. ఆర్థిక సహాయంగా ప్రభుత్వం సంవత్సరానికి మూడు శాతం వడ్డీ రాయితీతోపాటు ఏడు సంవత్సరాల వరకు బ్యాంక్ లోన్ గ్యారంటీ రుసుమును అందిస్తుంది. రానున్న మూడు నెలల్లో సుమారు 14 లక్షల మంది లబ్ధిదారులకు ఈ రుణాలు అందిస్తామని, ఎవరూ నిరాశ చెందాల్సిన పని లేదన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్.

Tags:    

Similar News