LPG Cylinder Price: భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర
LPG Cylinder Price: రూ.91.5 తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
LPG Cylinder Price: ఇటీవల వరుసగా పెరిగిపోయి సామాన్యులకు భారంగా మారిన గ్యాస్ ధరలు.. తగ్గుముఖం పట్టాయి. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు భారీగా తగ్గించాయి. 91 రూపాయల 50పైసలు మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తుందని చమురు సంస్థలు వెల్లడించాయి. 19 కిలోల కమర్షియల్ ఇండన్ గ్యాస్ సిలిండర్ పాత ధర 19వందల 76 రూపాయలు నుంచి ఇప్పుడు 18వందల 85 రూపాయలకు చేరింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 18వందల 85 రూపాయలు, ముంబైలో 18వందల 44 రూపాయలు, హైదరాబాద్‌లో 2వేల 99రూపాయలకు లభించనుంది. మే 19 నుంచి వాణిజ్య సిలిండర్ ధర 5వ సారి తగ్గింది. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. చివరగా జులై 6న మాత్రమే 50 రూపాయలు పెరిగింది. ఆ తర్వాత నుంచి పెరగలేదు.