వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్.. పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా..

LPG, Petrol & Diesel Price Hike: *రేటు పెంచక తప్పదంటున్న చమురు కంపెనీలు *ఏ మేరకు పెంచాలన్న దానిపై త్వరలో నిర్ణయం

Update: 2021-10-28 06:15 GMT

వంట గ్యాస్ ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్.. పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా..

LPG, Petrol & Diesel Price Hike: వంట గ్యాస్‌ ధరలు వచ్చే వారం మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు పెట్రోలు, డీజిల్‌ రేట్లు కూడా పెరగనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగిన దృష్ట్యా సిలిండర్‌పై వంద రూపాయల మేర నష్టం వస్తోందని, దాన్ని భర్తీ చేసుకోవడానికి రేటు పెంచక తప్పదని చమురు కంపెనీలు అంటున్నాయి.

ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఏ మేరకు పెంచాలన్నదానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల ఆరో తేదీనే సిలిండర్‌పై 15 పెరిగింది. జులై నుంచి లెక్కిస్తే విడతల వారీగా మొత్తం 90 రూపాయలు పెరిగినట్లయింది.

వంట గ్యాస్‌ ధరలు వచ్చే వారం మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు పెట్రోలు, డీజిల్‌ రేట్లు కూడా పెరగనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగిన దృష్ట్యా సిలిండర్‌పై వంద రూపాయల మేర నష్టం వస్తోందని, దాన్ని భర్తీ చేసుకోవడానికి రేటు పెంచక తప్పదని చమురు కంపెనీలు అంటున్నాయి.

ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఏ మేరకు పెంచాలన్నదానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల ఆరో తేదీనే సిలిండర్‌పై 15 పెరిగింది. జులై నుంచి లెక్కిస్తే విడతల వారీగా మొత్తం 90 రూపాయలు పెరిగినట్లయింది.

పెట్రోలు, డీజిల్‌ ధరలపై నియంత్రణ ఎత్తివేయడంతో అవి అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతిరోజూ మారుతున్నాయి. గ్యాస్‌ ధరలు నియంత్రణ పరిధిలోనే ఉన్నా, రాయితీని దాదాపుగా ఎత్తివేసింది. కొనుగోలు ధరతో సమానంగా ఉండేలా అమ్మకం ధరను దఫదఫాలుగా పెంచుతూ వస్తోంది. సబ్సిడీని భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే సిలిండర్‌ ధరలు పెంచుతామని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

పెంపు మరీ ఎక్కువగా ఉండబోదని తెలిపాయి. రేషన్‌ దుకాణాలను లాభసాటిగా మార్చడానికి వాటి ద్వారా చిన్న గ్యాస్‌ సిలిండర్లను పంపిణీ చేయించాలని బుధవారం కేంద్రం నిర్ణయించింది. ఆర్థిక లావాదేవీలు జరిపే సేవలను కూడా అందించే ఏర్పాట్లు చేయనుంది.

Tags:    

Similar News