Rain Alert:బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి..4 రోజులపాటు కుండపోత వర్షాలు

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో మంగళవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు బుధ, గురువారాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి బారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం, విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

Update: 2024-07-01 23:40 GMT

Rain Alert:బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి..4 రోజులపాటు కుండపోత వర్షాలు

Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో మంగళవారం అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని బుధ, గురువారాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం, విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సగటు సాధారణ వర్షపాతం 99.4మి.మీటర్లు ఉండగా 162 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం కురిసిందన్నారు.

19 జిల్లాల్లో అత్యధికం, 5 జిల్లాల్లో అధికం, 2 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు అయినట్లు వెల్లడించారు. రానున్న 4 రోజుల్లో వాతావరణం తడిగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారుగా, కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా పరడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి వివరించారు.

అటు ఉత్తరభారతాన్ని కూడా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రవాణ స్తంభించిపోయింది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులపాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశమున్న ఏడు రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది.

అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, పశ్చిమబెంగాల్, సిక్కిం, గుజరాత్, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈనెల 4వ తేదీ వరకు హెచ్చరికలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ హరియాణా, యూపీ, రాజస్థాన్, బిహార్, తమిళనాడు, మహారాష్ట్ర గోవా రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జులై 5వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది.

Tags:    

Similar News