Low Pressure: తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం
Low Pressure: వాయవ్య దిశగా పయనం * ఉత్తర ఒడిశా, ప.బెంగాల్ తీరం వైపు కదులుతున్న అల్పపీడనం
Low Pressure: తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరం వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయవ్య దిశగా పయనించి 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
అల్పపీడనం ప్రభావంతో.. ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వానలు కురిసే సూచనలు ఉన్నట్టు పేర్కొంది. సెప్టెంబర్ రెండో వారం వరకూ వర్షాలు పడే అవకాశాలున్నాయని, తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టి.. పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయంది.
మరోవైపు అల్పపీడనం ప్రభావం.. ఏపీలోని ఐదు జిల్లాలపై అధికంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో భారీవర్షాలు కురవొచ్చని సూచించింది. తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ నెల 13 వరకూ అక్కడక్కడ ఉరుములు మెరుపులతో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.