Priyanka Gandhi On Ayodhya Ceremony: రాముడు అందరివాడు : ప్రియాంకా గాంధీ

Priyanka Gandhi On Ayodhya Ceremony : అయోధ్యలో రేపటి (ఆగస్టు 05) న భూమిపూజ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి.

Update: 2020-08-04 12:16 GMT
Priyanka gandhi (File Photo)

Priyanka Gandhi On Ayodhya Ceremony : అయోధ్యలో రేపటి (ఆగస్టు 05) న భూమిపూజ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యూపీ ప్రభుత్వం నిఘావర్గాల హెచ్చరికల నేపధ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేస్తుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ రాముడిని కొనియాడుతూ ట్వీట్‌ చేశారు. దేశ ఐక్యత, సోదరాభావానికి, సాంస్కృతిక సమ్మేళనానికి ప సందర్భం కానుందని ఆమె ట్వీట్ చేశారు. నిరాడంబరత, ధైర్యం, సహనం, త్యాగం, అంకితభావాలకు శ్రీరాముడు ప్రతీకగా నిలుస్తారని కొనియాడారు. అంతేకాకుండా శ్రీరాముడు అందరితోనూ ఉన్నాడని అన్నారు.

ఈ భూమిపూజ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటుగా దేశంలోని దాదాపు 100 మందికి పైగా హాజరవుతున్నారు. కానీ ఇందులో కాంగ్రెస్‌ పార్టీకి ఆహ్వానం లేదు.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు అందిన వారికి మాత్రమే భూమిపూజ కార్యక్రమ ప్రాంగణంలోకి ప్రవేశం ఉంటుంది. ఆహ్వానం కలిగిన వారంతా ఉదయం 10.30 గంటలకల్లా అతిధులు తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలి. ప్రతి ఆహ్వాన పత్రికకు సెక్యూరిటీ కోడ్. కెమెరాలు , ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు అతిధులు తీసుకురావడానికి అనుమతి లేదు. భూమిపూజ కార్యక్రమానికి దేశంలోని 2 వేల ప్రాంతాల నుండి పవిత్రమైన మట్టి, 100 నదుల నుండి నీరు వినియోగం ఉపయోగిస్తున్నారు.

ఈ భూమిపూజ జరిగే వేదికపై ప్రధానితో పాటుగా మరో నలుగురికి మాత్రమే చోటుని కల్పిస్తున్నారు. అందులో ప్రధానితో పాటుగా ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, ఆలయ ట్రస్ట్ ఛైర్మన్ నిరిత్య గోపాల్ దాస్ మహారాజ్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ లకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.

Tags:    

Similar News