పార్లమెంట్‌లో నీట్‌ పేపర్‌ లీక్‌ దుమారం.. విపక్షాల గందరగోళంతో లోక్‌సభ సోమవారానికి వాయిదా

Lok Sabha: నీట్ పేపర్ లీక్‌పై హస్తినలో నిరసనలు కొనసాగుతున్నాయి.

Update: 2024-06-28 07:20 GMT

పార్లమెంట్‌లో నీట్‌ పేపర్‌ లీక్‌ దుమారం.. విపక్షాల గందరగోళంతో లోక్‌సభ సోమవారానికి వాయిదా 

Lok Sabha: నీట్ పేపర్ లీక్‌పై హస్తినలో నిరసనలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నీట్ పేపర్‌లీక్‌పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. విద్యార్ధులకు న్యాయం చేయాలని పార్లమెంట్ నుంచి అధికార, విపక్షాలు నీట్ విద్యార్థులకు సందేశం ఇవ్వాలని రాహుల్ గాంధీ లోక్ సభలో డిమాండ్ చేశారు. ఇటు పార్లమెంట్ వెలుపల నీట్ పేపర్ లీక్‌పై విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు.

రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించడానికి ముందే నీట్ పేపర్ లీక్‌పై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే లోక్ సభ స్పీకర్ మాత్రం రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ తర్వాత నీట్ పేపర్ లీక్‌పై చర్చ జరుపుతామని చెప్పడంతో సభలో గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది.

ఇటు రాజ్యసభలోనూ సేమ్ సీన్ నెలకొంది. సభ ప్రారంభం కాగానే నీట్‌పై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. రాజ్యసభలో పేపర్‌ లీక్‌ అంశాన్ని ఖర్గే లేవనెత్తారు. పేపర్‌ లీక్‌పై ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఖర్గే డిమాండ్‌ చేశారు. చర్చ జరపాలంటూ విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకువచ్చారు. 

Tags:    

Similar News