West Bengal: బెంగాల్ సీఎంగా ప్రమాణం చేయగానే కోవిడ్‌పై మమత దృష్టి
West Bengal: బెంగాల‌్ సీఎంగా మూడోసారి ప్రమాణం చేసిన వెంటనే మమతా బెనర్జీ కరోనా మహమ్మారిపై దృష్టి పెట్టారు.
West Bengal: బెంగాల్ సీఎంగా మూడోసారి ప్రమాణం చేసిన వెంటనే మమతా బెనర్జీ కరోనా మహమ్మారిపై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి దృష్ట్యా కొన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రజలు మాస్క్‌లు ధరించడం తప్పనిసరని, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం హాజరు మాత్రమే ఉంటుందని చెప్పారు. షాపింగ్ కాంప్లెక్స్‌లు, జిమ్‌లు, సినిమా హాళ్లు, బ్యూటీ పార్లర్లు మూసి ఉంటాయని మమత తెలిపారు. సామాజిక, రాజకీయ సమావేశాలపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని మార్కెట్లు, రిటైల్ దుకాణాలు, కిరాణా షాపులు ఉదయం 7 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకూ, ఆ తర్వాత సాయంత్ర 5 గంటల నుంచి 7 గంటల వరకూ మాత్రమే తెరుచుకోవచ్చని అన్నారు. గురువారం నుంచి లోకల్ రైళ్ళను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.