LK Advani: మళ్లీ క్షీణించిన ఎల్‌కే అద్వానీ ఆరోగ్యం,అపోలో ఆసుపత్రిలో చేరిక

LK Advani: మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. దీంతో ఆయన్ను ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను బుధవారం రాత్రి అపోలో ఆసుపత్రిలో చేర్చారు.

Update: 2024-07-03 23:31 GMT

LK Advani: మళ్లీ క్షీణించిన ఎల్‌కే అద్వానీ ఆరోగ్యం,అపోలో ఆసుపత్రిలో చేరిక

LK Advani: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ అపోలో ఆసుపత్రిలో చేరారు. బుధవార సాయంత్రం మథుర రోడ్డులోని అపోలో హాస్పిటల్‌లో ఎమర్జెన్సీలో చేర్చారు.డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో ఎల్‌కె అద్వానీ రాత్రి 9 గంటలకు అపోలో ఆసుపత్రిలో చేరారు. అద్వానీ పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పరిశీలనలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

గత వారం ఎయిమ్స్‌లో చేరిక:

అంతకుముందు జూన్ 26న కూడా లాల్ కృష్ణ అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేరారు. లాల్ కృష్ణ అద్వానీ యూరాలజీ, కార్డియాలజీ, జెరియాట్రిక్ మెడిసిన్ సహా వివిధ నిపుణులు పరీక్షించారు. అయితే, మరుసటి రోజు జూన్ 27న ఆయన ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఎయిమ్స్ ఆసుపత్రి అధికారులు మాట్లాడుతూ, “వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా అద్వానీ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. లాల్ కృష్ణ అద్వానీకి 96 ఏళ్లు.

మార్చిలో భారతరత్న అవార్డు:

ఈ ఏడాది మార్చి నెలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'ను ప్రదానం చేశారు. 1927లో కరాచీలో జన్మించిన అద్వానీ కుటుంబం దేశ విభజన తర్వాత 1947లో భారత్‌కు వచ్చింది. అద్వానీ (96) జూన్ 2002 నుండి మే 2004 వరకు ఉప ప్రధానమంత్రిగా, అక్టోబర్ 1999 నుండి మే 2004 వరకు కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు. 1986 నుండి 1990 వరకు, 1993 నుండి 1998 వరకు, 2004 నుండి 2005 వరకు అనేక సార్లు బిజెపి అధ్యక్షుడిగా ఉన్నారు. 

Tags:    

Similar News