తాగి డ్రైవింగ్ చేస్తే ఎం చేస్తారు. అప్పటికప్పుడు ఫైన్ వేస్తారు. మరి అదే కాకపోతే జైల్లో పెడుతారు. కానీ అక్కడ మాత్రం వెరైటీ.. అక్కడ మందు కొట్టి దొరికారో అంతే సంగతులు.. అలా దొరికితే రెండు వేల రూపాయల ఫైన్ కట్టి నెల తిరిగే లోపు మటన్ తో భోజనం పెట్టి ఊరందరికీ పార్టీ ఇవ్వాలి. ఇక తాగి నానా హంగామా చేస్తే అక్కడే అయిదు వేలు కట్టి ఊరందరికీ పార్టీ ఇవ్వాలి.
ఇది ఎక్కడో కాదండీ.. ! గుజరాత్ రాష్ట్రం లోని మనస్కంత జిల్లా అమీర్ ఘడ్ తాలూకా కట్టిసితార గ్రామంలో ఈ కండిషన్ నడుస్తుంది. యువత మద్యం సేవించి పక్కదారి పడకుండా ఉండేందుకు ఆ గ్రామంలో ఈ నిభందనను పెట్టుకున్నారు. తీర్మానం కూడా చేసేసుకున్నారు. దీనితో యువత భయపడి మద్యం సేవించడానికే భయపడుతున్నారు.
గతంలో పక్క గ్రామంలోని ఓ వ్యక్తి మందు తాగి కట్టిసితార గ్రామానికి వచ్చి హల్ చల్ చేశాడు. దీనితో గ్రామస్థులు అతన్ని పట్టుకొని డబ్బులు కట్టించేవరకు వదలలేదు.. గ్రామంలో ఇలాంటి నిబంధనతో ముందుకు వెళ్ళడం వల్ల కట్టిసితార గ్రామం మిగతా గ్రామాలకి ఆదర్శంగా నిలుస్తుంది. మొత్తానికి వారు ఎంచుకున్నా ఐడియా భలే ఉంది కదా .. !