Insurance: త్వరలో ఇన్సూరెన్స్ ఖరీదుగా మారవచ్చు.. ఎందుకంటే..?
* ఇన్సూరెన్స్ అనేది కుటుంబానికి ఒక రక్షణ వంటిది. * ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం పెంచేందుకు సిద్ధమవుతున్నాయి.
Insurance: ప్రతి వ్యక్తికి ఇప్పుడు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. అది లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్స్ రెన్స్ కానీ. కరోనా వల్ల ఈ విషయం అందరికి తెలిసి వచ్చింది. ఇన్సూరెన్స్ అనేది కుటుంబానికి ఒక రక్షణ వంటిది.
ఎవ్వరికి ఏమైనా కుటుంబ సభ్యులు ఆర్థికంగా చితికిపోకుండా కాపాడుతుంది.అయితే త్వరలో ఇన్సూరెన్స్ పాలసీలు చాలా ఖరీదు కానున్నాయి. రేట్లు పెంచడానికి కంపెనీలు సిద్దమవుతున్నాయి. మొదటగా హెల్త్ ప్రీమియం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎంత పెరుగుతాయి..?
ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పెంపు 25 నుంచి 40 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే ఇది హెల్త్ ఇన్స్ రెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ రెండింటికి వర్తిస్తుంది. కరోనా సమయంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఇన్సూరెన్స్ పొందడంపై ప్రజల్లో అవగాహన ఏర్పడింది.
కరోనా మహమ్మారి తర్వాత ఇన్సూరెన్స్ తీసుకునేవారి సంఖ్య 7 రెట్లు పెరిగింది. గతంలో కేవలం 10 శాతం మంది మాత్రమే ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేవారు. ఇప్పుడు 71 శాతం మంది ఇన్సూరెన్స్ కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు.
ఇన్సూరెన్స్ ఎందుకు ఖరీదైనది?
కంపెనీలు ఏడాదికి 3000 నుంచి 4000 డెత్ క్లెయిమ్‌లను పొందాయి. కరోనా సమయంలో ఒక సంవత్సరంలో 20,000 డెత్ క్లెయిమ్‌లు వచ్చాయి. అందువల్ల ఈ పెరుగుదల రీ-ఇన్సూరెన్స్ కంపెనీలకు నష్టాన్ని కలిగించింది.
కోవిడ్ సమయంలో చాలా మంది ప్రజలు బీమా క్లెయిమ్ చేసుకున్నారు. ఇది భారతదేశంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉంది. అందువల్ల భారతదేశంలోని రీ-ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియంను ఖరీదైనవిగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అందుకే ఆరోగ్య బీమా ఇప్పుడు చాలా ఖరీదైనది.
పెరిగిన ఇన్సూరెన్స్ వల్ల ఎవరిపై ఎంత భారం పడుతుందంటే15000 వార్షిక ప్రీమియంలో 25% పెరిగితే రూ. 3750 అదనంగా చెల్లించాలి. ఈ పెరుగుదల 30 శాతం ఉంటే అప్పుడు మీ ప్రీమియం 4500 ఎక్కువ చెల్లించాలి. మరోవైపు ఈ పెరుగుదల 40 శాతం అయితే రూ.6000 ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది.