LIC IPO: ఎల్‌ఐసీ కీలక నిర్ణయం.. IPOకి ముందు ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్ల నియామకం

LIC IPO: ఎల్‌ఐసీ కీలక నిర్ణయం.. IPOకి ముందు ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్ల నియామకం

Update: 2022-02-07 11:30 GMT

LIC IPO: ఎల్‌ఐసీ కీలక నిర్ణయం.. IPOకి ముందు ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్ల నియామకం

LIC IPO: దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్‌ కంపెనీ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా (LIC) త్వరలో మార్కెట్‌లోకి ఐపీవోని తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఫిబ్రవరి 1న బడ్జెట్‌లో కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దాదాపు ఈ సంవత్సరం మార్చి నాటికి ఐపీవో షేర్ మార్కెట్‌లోకి వచ్చేస్తుంది. దీనికి ముందు ఎల్‌ఐసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ గవర్నెన్స్‌కి సంబంధించిన రెగ్యులేటరీ నిబంధనలను నెరవేర్చేందుకు కొత్తగా ఆరుగురు స్వతంత్ర డైరెక్టర్లని నియమించింది.

ఎల్‌ఐసి మాజీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ అంజులీ చిబ్ దుగ్గల్, సెబి మాజీ సభ్యుడు జి. మహాలింగం, ఎస్‌బిఐ లైఫ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ నౌటియాల్‌లను బోర్డులో చేర్చుకున్నట్లు ఎల్‌ఐసీ వర్గాలు తెలిపాయి. వీరితో పాటు చార్టర్డ్ అకౌంటెంట్లు విజయ్ కుమార్, రాజ్‌కమల్, వీఎస్ పార్థసారథిలు ఎల్‌ఐసీ డైరెక్టర్ల బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌లుగా నియమితులయ్యారు. ఈ నియామకాలతో ఎల్‌ఐసీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్ల సంఖ్య తొమ్మిదికి చేరింది. దాదాపు ఖాళీలన్ని భర్తీ అయినట్లే .

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)కి IPO డాక్యుమెంట్ (DRHP) సమర్పించే ముందు కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలను పాటించడం అవసరం. ఎల్‌ఐసీ IPO కోసం కేంద్ర ప్రభుత్వం ఈ వారం పత్రాలను సమర్పించవచ్చు. సెబీ ఆమోదం తర్వాత ఎల్‌ఐసీ IPO మార్చిలో రావచ్చని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డీఐపీఏఎం) కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే తెలిపారు. ఎల్‌ఐసీ ఇష్యూలో 10 శాతం వరకు పాలసీదారులకు రిజర్వ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఎల్‌ఐసీ పాలసీ దారులు ఐపీవోలో పాల్గొనాలనుకుంటే రెండు విషయాలు తప్పనిసరి. ఒకటి ఎల్‌ఐసీ పాలసీ ఖాతాలో తప్పనిసరిగా పాన్ నంబర్ (PAN) ఉండాలి. రెండోది మీకు తప్పనిసరిగా డీమ్యాట్ ఖాతా ఉండాలి. అందుకే ఎల్‌ఐసీ పాలసీదారులను పాన్‌కార్డ్‌ని అప్‌డేట్ చేయమని కోరింది. దీంతో వారు పబ్లిక్‌ ఆఫర్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అంతేకాదు పాన్ వివరాలు కార్పొరేషన్ రికార్డులలో కూడా అప్‌డేట్‌ అయి ఉండాలి. ఎల్‌ఐసీకి 25 కోట్ల మంది పాలసీదారులు ఉండగా డీమ్యాట్ ఖాతాల సంఖ్య 8 కోట్లు మాత్రమే.

Tags:    

Similar News