మాస్కు ఆధార్ కార్డు గురించి తెలుసుకోండి.. దీనిని ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..?

మాస్కు ఆధార్ కార్డు గురించి తెలుసుకోండి.. దీనిని ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..?

Update: 2022-01-06 06:06 GMT

మాస్కు ఆధార్ కార్డు గురించి తెలుసుకోండి.. దీనిని ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..?

Mask Aadhaar Card: ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు ప్రతి ఒక్క భారతీయుడికి చాలా ముఖ్యమైనది. ఇది లేకుంటే ఏ పని జరుగదు. ఇది దేశంలోని అత్యంత ముఖ్యమైన కార్డులలో ఒకటి. ఇది ఒక వ్యక్తి గుర్తింపు, చిరునామాని తెలియజేస్తుంది. ఆధార్‌ లేకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సాయం మీకు చేరదు. మీరు ఏ పథకానికి అర్హులు కాలేరు. అయితే ఆధార్‌ కార్డు మాదిరే మరో కార్డు ఉంటుంది. దీనిని మాస్క్‌ ఆధార్ కార్డ్‌ అంటారు. ఇది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ద్వారా జారీ అవుతుంది. ఇది కూడా సాధారణ ఆధార్ లాంటిదే. కానీ భద్రత కోణం నుంచి చూస్తే సాధారణ ఆధార్ కార్డ్ కంటే మాస్క్డ్ ఆధార్ కార్డ్ చాలా సురక్షితమైనది.

మాస్క్డ్ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి?

మాస్క్‌ ఆధార్ సాధారణ ఆధార్ కార్డ్‌ని పోలి ఉంటుంది. కానీ ఆధార్ నంబర్ పాక్షికంగా దాచబడి ఉంటుంది. సరళంగా చెప్పాలంటే మాస్క్డ్ ఆధార్ కింద 12 అంకెల ఆధార్ నంబర్‌లో చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. మొదటి ఎనిమిది అంకెలు ఉండవు. కస్టమర్ గుర్తింపుని ఇది రక్షిస్తుంది. కార్డు పోయినట్లయితే అది దుర్వినియోగం కాకుండా చూసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. మీరు మాస్క్డ్ ఆధార్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయాలనుకుంటే ఈ స్టెప్స్‌ పాటించండి.

1. ముందుగా మీరు UIDAI అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

2. తర్వాత మీరు డ్రాప్-డౌన్ మెను నుంచి 'My Aadhar' ఎంపికను ఎంచుకుని 'Aadhaar Card Download' ఎంపికను ఎంచుకోవాలి.

3. తర్వాత 12 అంకెల ఆధార్ నంబర్ నమోదు చేయండి.

4. తర్వాత మీరు 'మాస్క్డ్ ఆధార్' ఎంపికను ఎంచుకుని క్యాప్చా కోడ్ ధృవీకరించాలి.

5. ఇప్పుడు డ్రాప్-డౌన్ మెను నుంచి 'Send OTP' ఎంపికను ఎంచుకోండి.

6. OTPని నమోదు చేసిన తర్వాత మాస్క్ చేయబడిన మీ ఆధార్ లేదా ఈ-ఆధార్ కార్డ్‌ డౌన్‌లోడ్ అవుతుంది.

Tags:    

Similar News