Kerala: కేరళలో మత మార్పిడి వల్ల లాభ పడింది హిందూ మతమే
Kerala: కేరళలో బలవంతపు మతమార్పిడుల నిరోధక చట్టాన్ని తీసుకొస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.
Kerala: కేరళలో బలవంతపు మతమార్పిడుల నిరోధక చట్టాన్ని తీసుకొస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. హిందువులు, క్రైస్తవులను మచ్చిక చేసుకోవడం కోసం ఈ హామీ ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే కేరళలో మత మార్పిడుల వల్ల ఎక్కువ లబ్ధి పొందుతున్నది హిందూ మతమేనని అధికారికంగా వెల్లడైంది. 2020లో కేరళలో 506 మంది మతం మారారు. వీరిలో 241 మంది ఇస్లాం లేదా క్రైస్తవం నుంచి హిందూ మతం స్వీకరించారు.
ఇస్లాం మతంలోకి మారిన వారి సంఖ్య 144 కాగా 119 మంది క్రైస్తవం స్వీకరించారు. గణాంకాలను పరిశీలిస్తే దళిత క్రైస్తవులు ఎక్కువగా హిందూ మతంలోకి మారుతున్నట్లు వెల్లడైంది. వ్యక్తులు తమ మతాన్ని అధికారికంగా మార్చుకోవాలంటే, ప్రభుత్వ గెజిట్‌లో ప్రకటించవలసి ఉంటుంది. గెజిట్ వివరాల ఆధారంగానే మత మార్పిడుల వల్ల హిందూ మతమే ఎక్కువ లాభపడినట్లు తేలింది. ఇంక బీజేపీ మతమార్పిడి చట్టం తెచ్చేది ఎవరి కోసమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.