Darbhanga Bomb Blast: నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు
Darbhanga Bomb Blast: బీహార్ దర్భంగా బ్లాస్ట్ కేసులో నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
Darbhanga Bomb Blast: బీహార్ దర్భంగా బ్లాస్ట్ కేసులో నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్‌లకు పాకిస్తాన్ ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. లష్కరే తొయిబా ముఖ్యనేత ఆదేశాలతో మాలిక్ బ్రదర్స్ హైదరాబాద్ వచ్చినట్లు తెలుసుకున్నారు. సికింద్రాబాద్ దర్భంగా ఎక్స్‌ప్రెస్‌ను పేల్చేందుకు కుట్ర పన్నినట్లు తేల్చారు. పేలుళ్లకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఐఎస్‌ఐ ముఖ్యనేత ఇక్బాల్ వ్యూహరచన చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. 2012లో పాకిస్తాన్ వెళ్లిన ఇమ్రాన్ మాలిక్‌కు ఇక్బాల్ ఉగ్రకుట్రకు శిక్షణ ఇచ్చారు. మాలిక్ సోదరులతోపాటు యూపీకి చెందిన సలీం, ఖాఫిల్ కూడా ఇక్బాల్‌లో శిక్షణ తీసుకున్నారు. 2016లో మాలిక్ బద్రర్స్, సలీం, ఖాఫిల్ దుబాయ్ వెళ్లినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.
ఇక బాంబ్ తయారీలో రసాయనాల వాడకంపై ఇమ్రాన్‌కు ఇక్బాల్ యూట్యూబ్ లింక్ పంపినట్లు గుర్తించారు. ఇక్బాల్ హైదరాబాద్‌లోని చిక్కడపల్లి, హబీబ్‌నగర్‌లో ముడిసరుకు కొనుగోలు చేసి ఇంట్లో నిర్వహించిన ట్రయల్స్ సక్సెస్ కావడంతో పార్సిల్‌లో మాలిక్ బ్రదర్స్ బాంబు అమర్చినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. 16 గంటల్లో రైలులో పేలుడు జరిగేలా ప్లాన్ చేశారు. భారీ పేలుడుకు ముందు ఇది శాంపిల్ కుట్రా..?. లేదా ఎన్‌ఐఏ దృష్టి మరల్చి మరో విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.