Lakhimpur Kheri Incident - Ashish Mishra: లఖీంపూర్ ఘటనలో ముదురుతోన్న వివాదం

Lakhimpur Kheri Incident - Ashish Mishra: ఆశిష్‌కు మళ్లీ నోటీసులు జారీ చేసిన పోలీసులు...

Update: 2021-10-09 04:42 GMT

Lakhimpur Kheri Incident - Ashish Mishra: లఖీంపూర్ ఘటనలో ముదురుతోన్న వివాదం

Lakhimpur Kheri Incident - Ashish Mishra: లఖీంపూర్ ఖేరీ ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి అమిత్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాకు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలోగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేశారు.. నిన్న నోటీసులు అందించేందుకు వెళ్లిన అధికారులకు నిరాశే మిగిలింది. దాంతో ఆశిష్ మిశ్రా ఇంటికి నోటీసులు అంటించారు.. విచారణకు ఇవాళ హాజరుకాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరోవైపు.. ఆశిష్ మిశ్రా గైహాజరుపై ఆయన తండ్రి అజయ్ మిశ్రా స్పందించారు.. చట్టంపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని పేర్కొన్నారు.. తన కుమారుడు అమాయకుడని, ఆరోగ్యం బాగోనందునే విచారణకు హాజరుకాలేదని అజయ్ మిశ్ర చెప్పారు.. మరోవైపు.. అశిష్ మిశ్రా నేపాల్ పారిపోయినట్టు తెలుస్తోంది. అందుకే ఆయన అందుబాటులో లేరని అంటున్నారు. 

ప్రధాని మోడీ రాజధర్మం పాటించాలని, అజయ్ మిశ్రను సహాయమంత్రి పదవి నుంచి తప్పించాలని, ఆయన కుమారుడిని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఆశిష్‌ను అరెస్ట్ చేయాలంలూ పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్‌జోత్ సింగ్ సిద్ధూ నిరాహారదీక్ష చేపట్టారు.. ఘటనపై మోడీ ఎందుకు మౌనం వహిస్తున్నారని సీనియర్ నేత కపిల్ సిబల్ ప్రశ్నించారు.

Tags:    

Similar News