SBI: అలర్ట్.. 3 రోజులే గడువు
SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఖాతాదారులా.. అయితే వెంటనే కేవైసీ వివరాలను త్వరగా అప్‌డేట్ చేసుకోండి.
SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఖాతాదారులా.. అయితే వెంటనే కేవైసీ వివరాలను త్వరగా అప్‌డేట్ చేసుకోండి. లేకపోతే మీ ఖాతాసేవలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఈనెల మే 31 లోగా కేవైసీ వివరాలను అప్‌డేట్ చేయాలని ట్విట్టర్‌లో, ఈమెయిల్ ద్వారా కస్టమర్లకు సమాచారం అందించింది. ఈమేరకు ఎస్‌బీఐ ఖాతాదారులు తప్పనిసరిగా 2021 మే 31 లోగా కేవైసీని అప్‌డేట్ చేసుకోవాల్సిందేనని, లేదంటే ఖాతా సేవలు నిలిచిపోయే అవకాశం ఉందని పేర్కొంది. అనేక రాష్ట్రాలు కరోనా కట్టడికి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కస్టమర్లు పోస్ట్ లేదా ఈ-మెయిల్ ద్వారా కేవైసీ వివరాలను బ్యాంకుకు పంపాలని తెలిపింది.
ప్రభుత్వం చేత గుర్తింపబడిన పాస్ పోర్ట్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, NREGA కార్డ్, పాన్ కార్డ్ వంటి వాటిలో ఏదైనా ఈ మెయిల్, పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. కెవైసీ పేరుతో కొందరు మోసానికి పాల్పడుతున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది. ఇలాంటి వారి నుంచి జాగ్రత్తగా ఉండాలని, కెవైసీ అప్డేట్ అంటూ వచ్చే లింకులను క్లిక్ చేయవద్దు అని కోరింది.