కమెడియన్ కునాల్ కమ్రాపై ఇండిగో నిషేధం
ముంబై నుండి లక్నోకు వెళుతోన్న టెలివిజన్ న్యూస్ యాంకర్ అర్నాబ్ గోస్వామిని హేళన చేసినందుకు కమెడియన్ కునాల్ కమ్రాకు భారత అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఆరు నెలల పాటు నిషేధించింది.
ముంబై నుండి లక్నోకు వెళుతోన్న టెలివిజన్ న్యూస్ యాంకర్ అర్నాబ్ గోస్వామిని హేళన చేసినందుకు కమెడియన్ కునాల్ కమ్రాకు భారత అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఆరు నెలల పాటు నిషేధించింది. తదుపరి నోటీసు వచ్చేవరకు కమ్రా తన విమానాలలో దేనినైనా ప్రయాణానికి అనుమతించమని ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా తెలిపింది.
కమ్రాపై ఇలాంటి ఆంక్షలు విధించాలని ప్రభుత్వం సలహా ఇస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్విట్టర్ లో పేర్కొన్నారు. దాంతో ఇతర విమానయాన సంస్థలు కూడా దీనిని అనుసరిస్తాయని తెలుస్తోంది.
ఇండిగో విమానంలో గోస్వామిని ఎగతాళి చేసినట్లు వస్తోన్న ఆరోపణలపై కమ్రా స్పందించారు. ట్విట్టర్‌లో మంగళవారం పోస్ట్ చేసిన వీడియోలో, ఎయిర్ హోస్టెస్ కోరిన వెంటనే తాను తన సీటుకు తిరిగి వచ్చానని, ఎటువంటి ఇబ్బంది కలగలేదని పేర్కొన్నాడు. 'గోస్వామి నేను మర్యాదగా మాట్లాడుకున్నాం. తరువాత న్యూస్ యాంకర్ అతని జర్నలిజం గురించి నేను ఏమనుకుంటున్నానో దాని గురించి ఒక మోనోలాగ్ ఇచ్చాను. దాంతో స్టీవార్డెస్ నన్ను తరలించమని అడగడంతో నేను 20 సెకన్లలో తిరిగి నా సీటు వద్దకు వెళ్ళాను. పైలట్లతో సహా ప్రతి సిబ్బందికి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాను.' అని పేర్కొన్నారు.
అతను వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కొన్ని గంటల తరువాత, ఇండిగో వరుస ట్వీట్లలో ఇలా పేర్కొంది ..'6E 5317 బోర్డులో ముంబై నుండి లక్నో ప్రయాణంలో ఇటీవల జరిగిన సంఘటన మా దృష్టికి వచ్చింది. మేము మిస్టర్ కునాల్ కమ్రాను సస్పెండ్ చేస్తున్నట్లు తెలియజేయాలనుకుంటున్నాము. ఆన్‌బోర్డ్‌లో అతని ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. దీనికి ఆరు నెలల పాటు ఇండిగోలో ప్రయాణించకుండా ఉండేలా ఆంక్షలు విధించాం. అతని ప్రవర్తన తోటి ప్రయాణీకుల భద్రతకు రాజీ పడే అవకాశం ఉన్నందున, ఆన్‌బోర్డ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు ఇలా చేశాం' అని తెలిపింది.
ఇండిగో నిర్ణయం తరువాత, పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా దీనిపై స్పందించారు.. 'ఒక విమానం లోపల అవాంతరాలను రేకెత్తించడానికి, సృష్టించడానికి రూపొందించిన ప్రమాదకర ప్రవర్తన పూర్తిగా ఆమోదయోగ్యం కాదు, ఇది వాయు ప్రయాణికుల భద్రతకు అపాయం కలిగిస్తుంది. సంబంధిత వ్యక్తిపై ఇలాంటి ఆంక్షలు విధించాలని ఇతర విమానయాన సంస్థలకు సలహా ఇవ్వడం తప్ప మాకు వేరే మార్గం లేదు' అని అన్నారు.
కాగా 2017 లో, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రయాణికులు ఆన్-బోర్డుకు అంతరాయం కలిగించే ప్రవర్తనను పరిష్కరించడానికి నియమాలను తయారుచేసింది.. అందుకోసమా 'నో-ఫ్లై లిస్ట్' ను ఏర్పాటు చేసింది. నిబంధనల ప్రకారం, వికృత ప్రవర్తనపై.. పైలట్-ఇన్-కమాండ్ చేత దాఖలు చేయించవలసి ఉంటుంది . అలాంటి ఫిర్యాదులను ఎయిర్లైన్స్ ఏర్పాటు చేసే అంతర్గత కమిటీ విచారించాలి. ఈ విషయాన్ని కమిటీ 30 రోజుల్లో నిర్ణయిస్తుంది.. అంతేకాకుండా నిషేధ వ్యవధిని కూడా నిర్దేశిస్తుంది. విచారణ పెండింగ్‌లో ఉన్న కాలంలో సదరు ప్రయాణీకులపై నిషేధం విధించడానికి సంబంధిత విమానయాన సంస్థకు అధికారం ఉంటుంది.