KRMB - GRMB: కాసేపట్లో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ
KRMB - GRMB: *అక్టోబర్ 14నుంచి అమల్లోకి రానున్న గెజిట్ నోటిఫికేషన్ *గడువు పెంచాలని కోరుతున్న రెండు తెలుగు రాష్ట్రాలు
KRMB - GRMB: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులతో కేంద్ర ప్రభుత్వం కాసేపట్లో అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి అధ్యక్షతన కృష్ణాబోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్, గోదావరి బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ హాజరు కానున్నారు. కృష్ణా, గోదావరి బోర్డులకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌లో ప్రాజెక్టుల పరిధి, వాటిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభిప్రాయాలు, అభ్యంతరాలు, తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే రెండు నదులపై నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టు అనుమతులపై కూడా సీరియస్‌గా చర్చించనున్నారు.
ఈ ఏడాది జులై 15న కృష్ణా, గోదావరి నదులకు సంబంధించి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ అక్టోబర్ 14నుంచి అమల్లోకి రానుంది. అయితే మరికొంత గడువు అవసరమని రెండు రాష్ట్రాలు కృష్టా,గోదారి రివర్ మేనేజ్‌మెంట్బోర్డుల సమావేశాల్లో రిక్వెస్ట్ చేశాయి.