Krishna River: మూసీని తలపిస్తున్న కృష్ణా నది.. కాలుష్యపు కోరల్లో చిక్కుకున్న జీవనది

Krishna River: జీవ నదిగా పేరొందిన కృష్ణమ్మ కాలుష్య కోరల్లో చిక్కుకుంది

Update: 2023-07-10 02:27 GMT

Krishna River: మూసీని తలపిస్తున్న కృష్ణా నది.. కాలుష్యపు కోరల్లో చిక్కుకున్న జీవనది

Krishna River: మూసీని తలపిస్తున్న కృష్ణా నది సజీవ రూపాన్ని కోల్పోతున్న కృష్ణా కాలుష్యపు కోరల్లో చిక్కుకున్నజీవనది ప్రజల అవగాహనా లోపం.అధికారుల అలసత్వం కృష్ణమ్మకు శాపంలా మారిన వైనం టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు.వేల కొద్దీ గ్యాలన్ల డ్రైనేజీ వాటర్‌తో మురికికూపంలా మారిన కృష్ణానది ప్రభుత్వం. అధికారులు పట్టించుకోవాలని స్థానికుల వినతి

కృష్ణా నది తన సజీవ రూపాన్ని కోల్పోతోంది. లక్షలాది ఎకరాలకు సాగు నీరు, వేల గ్రామాలకు తాగు నీరు అందించే కృష్ణమ్మ కాలుష్య కోరల్లో చిక్కుకుని కకావికలం అవుతోంది. టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు. వేల కొద్దీ గ్యాలన్ల డ్రైనేజ్ వాటర్ నీటితో కృష్ణా నది మురికికూపంలా మారుతోంది.

స్వచ్ఛంగా ఉండే కృష్ణా నీరు రోజూ రోజుకీ రంగు మారుతోంది. జీవ నదిగా పేరొందిన కృష్ణమ్మ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. వేల కిలోమీటర్ల పారుతూ వస్తున్న కృష్ణా నదిలో... నిత్యం వేల గ్యాలన్ల మురుగు నీరు, టన్నుల కొద్దీ చెత్త కలుస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రజల అవగాహనా లోపం, అధికారుల అలసత్వం వెరసి కృష్ణమ్మ పాలిట శాపంలా మారింది. తెలంగాణ భుబాగం నుంచి ఏపీలోకి కృష్ణా నది పారుతున్న క్రమంలో జగ్గయ్యపేట సమీపంలోకి చేరుకుంటుంది. జగ్గయ్యపేట పరిధిలోని సిమెంట్, కెమికల్ ఫ్యాక్టరీలతోపాటు డ్రైనేజ్ వ్యర్థాలతో పాటు నదిలో కలుస్తుండడంతో నది మూసీని తలపిస్తోంది.

కృష్ణా జిల్లాలో ఎగువన ఉన్న జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాల నుంచి... దిగువన ఉన్న అవనిగడ్డ సమీపంలోని హంసలదీవి వద్ద కృష్ణా నీరు సముద్రంలో కలుస్తోంది. జిల్లాలో సుమారు 100 కిలోమీటర్ల మేర నదీ ప్రవాహం ఉండగా... ప్రకాశం బ్యారేజీ వద్ద ఏడాది పొడవునా 12 అడుగుల మేర 3 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. ఎగువన ఉన్న గుంటూరు జిల్లాలోని పులిచింతల వద్ద 45 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. నీరు ప్రవాహంలా కాకుండా నిల్వ ఉంటోంది. ప్రజలు చెత్త వేయడంతో కలుషితం అవుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఎగువన ఉన్న తెలంగాణ నుంచి వస్తున్న కృష్ణా నదిలో... కాలువలు, చెరువుల ద్వారా కూడా పెద్ద ఎత్తున కాలుష్యం వచ్చి చేరుతోంది. అయితే మున్నేరు, కట్టలేరు, వైరా నుంచి వస్తున్న వాగులు, వంకల నుంచి వస్తున్న వరద నీటికి కాలుష్యంతో పాటు డ్రైనేజీ, ప్లాస్టిక్ వ్యర్ధాలు తోడవడంతో ఈ నది కాలుష్యపు బారిన పడిందని, దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News