Parliament Sessions: ఆకట్టుకున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాస్క్

Parliament Sessions: కోవిడ్ -19 నుంచి రక్షించుకోవడానికి ప్రజలు మాస్క్‌లు ధరించి బయటకు వస్తున్నారని అందరికీ తెలిసిందే.

Update: 2021-03-09 09:40 GMT

రాజ్యసభ సభ్యుడు నరేంద్ర జాదవ్ (ఫొటో హన్స్ ఇండియా)

Parliament Sessions: కోవిడ్ -19 వైరస్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు మాస్క్‌లు ధరించి బయటకు వస్తున్నారని అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు, మనం చాలా రకాల మాస్క్‌లను చూసే ఉంటాం. రెండవ విడత పార్లమెంట్ సమావేశాల్లో (Parliament Sessions) అందరి దృష్టిని ఆకర్షించేలా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) తయారు చేసిన ప్రత్యేకమైన మాస్క్‌తో దర్శనమిచ్చారు రాజ్యసభ సభ్యుడు నరేంద్ర జాదవ్.

కోవిడ్ -19 (Covid-19) మహమ్మారి నుంచి రక్షణ కోసం మాస్కులు ఉపయోగిస్తున్నారు. అయితే, చాలా మంది వివిధ రకాల మాస్కులు ధరిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటరీ సమావేశాలకు ఎంపీలు కూడా మాస్కులు ధరించి సభలకు హాజరవుతున్నారు. అయితే, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి రూపొందించిన ప్రత్యేక మాస్క్ సోమవారం సభలో హాట్ టాపిక్ లా మారింది.

రాజ్యసభ సభ్యుడు నరేంద్ర జాదవ్ వినూత్న మాస్క్ ధరించి సభకు రావడంతో.. కళ్ళన్నీ ఆయనవైపే ఉన్నాయి. వారిలో చాలామంది మాస్క్(Mask) గురించిన వివరాలే నరేంద్ర జాదవ్ నుంచి తెలుసుకున్నారు. దానికి సమాధానంగా ఈ ప్రత్యేకమైన మాస్క్‌ను తన స్నేహితుడు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బహుమతిగా ఇచ్చారని నరేంద్ర జాదవ్ తెలిపారు.

Tags:    

Similar News