Kolkata rape And murder case: కోల్‌కత్తా అత్యాచారం ఘటనలో విచారణ వాయిదా

Kolkata rape And murder case: వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన సుప్రీం కోర్టు

Update: 2024-09-09 10:32 GMT

Supreme Court

Kolkata rape And murder case: కోల్‌కత్తా అత్యాచారం ఘటనలో ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు విధులకు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశించింది. విధులకు హాజరుకాకుంటే... ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. పశ్చిమబెంగాల్‌లో ఏం జరుగుతుందో తమకు అవగాహన ఉందని పేర్కొంది. 28 రోజులుగా రెసిడెంట్ డాక్టర్లు ఆందోళనలో ఉండటం కారణంగా... 27 మంది మృతి చెందగా.... సుమారు 6 లక్షల మంది చికిత్సకు నోచుకోలేదని తెలిపింది.

రెసిడెంట్ డాక్టర్లు హాజరుకాకుంటే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కోల్‌కత్తాలో మాత్రమే జూనియర్ డాక్టర్లు విధులకు దూరంగా ఉన్నారని డాక్టర్ల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు అత్యాచార ఘటనపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. అత్యాచార ఘటన జరిగిన సమయంలో వివరాలతో పాటు, సీసీటీపీ ఫుటేజీ సీబీఐకి ఇచ్చారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విచారణకు మరో వారం రోజుల పాటు సీబీఐకి గడువు ఇచ్చింది. వచ్చే విచారణ తేదీకి ఫ్రెష్ స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News