CJI Justice Sanjiv Khanna: సుప్రీంకోర్టు సీజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణం

CJI Justice Sanjiv Khanna: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణం చేశారు.

Update: 2024-11-11 05:50 GMT

CJI Justice Sanjiv Khanna: సుప్రీంకోర్టు సీజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణం

CJI Justice Sanjiv Khanna: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖండ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తదితరులు హాజరయ్యారు.

సీజేఐగా డివై చంద్రచూడ్ పదవీ కాలం నవంబర్ 10తో పూర్తైంది. ఆయన స్థానంలో సంజీవ్ ఖన్నా పేరును చంద్రచూడ్ ప్రతిపాదించారు. రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. సంజీవ్ ఖన్నా 2025 మే 13 వరకు సీజేఐగా కొనసాగుతారు. 2019 జనవరి నుంచి ఆయన సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఆరు ఏళ్ల కాలంలో పలు అంశాలపై ఆయన 117 తీర్పులు ఇచ్చారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా ఉన్నారు.

1983లో న్యాయవాద వృత్తిలోకి

1960 మే 14న న్యూదిల్లీలో ఆయన జన్మించారు. లా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 1983లో ఆయన దిల్లీ బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకొని న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. తీస్ హాజారీ కాంప్లెక్స్ జిల్లా కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు.దిల్లీ హైకోర్టు, ట్రిబ్యునల్ కోర్టులలో ప్రాక్టీస్ చేశారు. 2004 దిల్లీ నేషనల్ కేపిటల్ టెరిటోరి స్టాండింగ్ కౌన్సిల్, ఇన్ కమ్ ట్యాక్స్ స్టాండింగ్ సీనియర్ కౌన్సిల్ గా కొనసాగారు. 2005లో దిల్లీ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 జనవరి 18న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

Tags:    

Similar News