Top 6 News @ 6PM: ఏపీ బడ్జెట్‌లో ఏ శాఖకు ఎంత కేటాయించారంటే - కేటీఆర్ అందుకే అర్జెంట్‌గా ఢిల్లీకి వెళ్లారా?

Update: 2024-11-11 12:37 GMT

1) AP Budget Live Updates: బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్.. ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..?

AP Budget Live Updates: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ జరిగే బీఏసీ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైఎస్ఆర్ సీపీ నిర్ణయం తీసుకుంది. అయితే శాసనమండలికి మాత్రం ఆ పార్టీ సభ్యులు హాజరుకానున్నారు. రూ. 2.94 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. బడ్జెట్ కేటాయింపుల పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) చంద్రబాబుపై వ్యాఖ్యలు.. డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మపై కేసు నమోదు

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మపై ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బ్రహ్మణి వ్యక్తిత్వాన్ని కించపర్చేలా పోస్టులు పెట్టారని ఆయనపై టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

వ్యూహం సినిమాను 2024 మార్చి 2న ఈ సినిమాను విడుదల చేశారు.ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని తెలంగాణ హైకోర్టులో అప్పట్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సినిమాపై ఏర్పాటు చేసిన కమిటీ సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో సినిమా విడుదలకు అడ్డంకులు తొలగాయి. వాస్తవానికి ఈ సినిమా 2024 ఫిబ్రవరి 23న విడుదల కావాలి. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

3) Revanth Reddy: తెలంగాణ ఏం కోల్పోలేదు.. పెద్దాయన ఇంట్లో నలుగురి ఉద్యోగాలు తప్ప..

CM Revanth Reddy: గత ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పది నెలల్లో ఏం కోల్పోయామన్నది ప్రజలకు అర్దమైందన్నారు. ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో ఏఎంవీఐలకు నియామక పత్రాల అందజేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పదినెలల్లో పెద్దాయన ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు కోల్పోయారు తప్ప తెలంగాణ ప్రజలు కోల్పోయిందేమీ లేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి.. రైతులు రుణమాఫీతో రుణ విముక్తులయ్యారన్నారు. ఒక కోటి ఐదు లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో లబ్దిపొందారన్నారు. 49 లక్షల 90వేల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిందని.. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

4) KTR: హుటాహుటిన ఢిల్లీకి కేటీఆర్.. ఎందుకంటే…?

KTR Delhi Tour: భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ధిల్లీకి వెళ్లారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఆయన సమావేశమౌతారు. అమృత్ టెండర్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని ఆయన గతంలో ఆరోపణలు చేశారు. ఈ విషయమై కేంద్రమంత్రికి ఫిర్యాదు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి కేటాయించిన నిధుల్లో దాదాపు రూ. 1500 కోట్ల టెండర్లను సీఎం రేవంత్ రెడ్డి తన బావమరిది ఎస్. సృజన్ రెడ్డి కంపెనీకి కట్టబెట్టబెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి ఈ ఏడాది సెప్టెంబర్ 20న లేఖ రాశారు.ఈ టెండర్లు దక్కించుకున్న కంపెనీల వివరాలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పురపాలక శాఖలో జరిగిన అన్ని టెండర్లను బయటపెట్టాలని కోరారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

5) CJI Justice Sanjiv Khanna: సుప్రీంకోర్టు సీజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణం

CJI Justice Sanjiv Khanna: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖండ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తదితరులు హాజరయ్యారు. సీజేఐగా డివై చంద్రచూడ్ పదవీ కాలం నవంబర్ 10తో పూర్తైంది. ఆయన స్థానంలో సంజీవ్ ఖన్నా పేరును చంద్రచూడ్ ప్రతిపాదించారు. రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. సంజీవ్ ఖన్నా 2025 మే 13 వరకు సీజేఐగా కొనసాగుతారు. 2019 జనవరి నుంచి ఆయన సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. ఆరు ఏళ్ల కాలంలో పలు అంశాలపై ఆయన 117 తీర్పులు ఇచ్చారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా ఉన్నారు.

1960 మే 14న న్యూదిల్లీలో ఆయన జన్మించారు. లా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 1983లో ఆయన దిల్లీ బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకొని న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. తీస్ హాజారీ కాంప్లెక్స్ జిల్లా కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. దిల్లీ హైకోర్టు, ట్రిబ్యునల్ కోర్టులలో ప్రాక్టీస్ చేశారు. 2004 దిల్లీ నేషనల్ కేపిటల్ టెరిటోరి స్టాండింగ్ కౌన్సిల్, ఇన్‌కమ్ ట్యాక్స్ స్టాండింగ్ సీనియర్ కౌన్సిల్‌గా కొనసాగారు. 2005లో దిల్లీ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 జనవరి 18న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

6) Donald Trump: అమెరికా ప్రెసిడెంట్‌గా మొదటి రోజే ట్రంప్ తీసుకోబోయే సంచలన నిర్ణయాలు

What Donald Trump is going to do on Day 1 in White house: అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ గెలిచారు. అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే తీసుకునే సంచలన నిర్ణయాలు ఏంటి అనేదే ఇప్పుడు చాలామంది ముందున్న సందేహం. ఆ విషయంలో ట్రంప్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తానని గతేడాది డిసెంబర్‌లోనే ట్రంప్ ప్రకటన చేశారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే బాధ్యతలు తీసుకున్న తొలిరోజే తాను తీసుకోబోయే నిర్ణయాల గురించి వివరించారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Tags:    

Similar News