చైనా సరిహద్దు ప్రాంతమైన లద్దాక్‌లో బీజేపీ పాగా వేసింది. మొత్తం 26 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 14 స్థానాల ఫలితాలు వెలుబడ్డాయి. ఇందులో బీజేపీ 10 స్థానాలు కైవసం చేసుకుని ముందంజలో ఉంది. అదేవిధంగా కాంగ్రెస్, ఇండిపెండెట్లు రెండేసి సీట్లను కైవసం చేసుకున్నాయి. ఇక లద్దాక్‌లో జరుగుతున్న అటాన్మెస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యవహరించారు. దాంతో, బీజేపీ గెలుపులో కిషన్‌రెడ్డి కృషి ఉందంటూ ప్రశంసలు వర్షం కురుస్తోంది.