మీ డబ్బుని రెట్టింపు చేయాలనుకుంటే పోస్టాఫీసులోని ఈ స్కీమ్ బెస్ట్..
Kisan Vikas Patra: ప్రజలు కష్టపడి సంపాదించిన తమ సొమ్మును సురక్షితమైన పథకాలలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తారు.
Kisan Vikas Patra: ప్రజలు కష్టపడి సంపాదించిన తమ సొమ్మును సురక్షితమైన పథకాలలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తారు. ఎందుకంటే ఇటీవల ఆన్లైన్ సైబర్ దాడులు పెరిగిపోవడంతో డబ్బుకు భద్రత ఉండటం లేదు. అందుకే వినియోగదారులు పెట్టుబడి పెట్టేముందు తమ డబ్బు సురక్షితంగా ఉంటుందా లేదా అని చెక్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా రాబడి గురించి కూడా ఆలోచిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ రాబడి రావాలి డబ్బు కూడా భద్రంగా ఉండాలి.
ఇలాంటి ఆలోచన ఉన్నవారికి పోస్టాఫీసులోని ఈ స్కీమ్ బెటర్గా ఉంటుంది. ఎందుకంటే పోస్టాఫీసు ఒక ప్రభుత్వం సంస్థ, డబ్బుకి రక్షణ ఉంటుంది. అదే సమయంలో మీ డబ్బు 124 నెలలలో రెట్టింపు అవుతుంది. ఆ పథకం పేరు కిసాన్ వికాస్ పత్ర. KVP ప్రస్తుతం 6.9 శాతం వడ్డీని పొందుతోంది. దీని ప్రకారం మీ డబ్బు 124 నెలల్లో రెట్టింపు అవుతుంది. బ్యాంకులలోని ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే ఇక్కడే వడ్డీ ఎక్కువగా వస్తోందని చెప్పవచ్చు.
పోస్ట్ ఆఫీస్ ద్వారా అమలు చేయబడిన కిసాన్ వికాస్ పత్ర (KVP) పథకం మీ డబ్బుని సురక్షితంగా ఉంచుతుంది. మెచ్యూరిటీపై రెట్టింపు రాబడిని అందిస్తుంది. కిసాన్ వికాస్ పత్ర పథకం భారత ప్రభుత్వంచే నిర్వహించబడుతుంది. ఇక్కడ మీ డబ్బు ఒక నిర్దిష్ట వ్యవధిలో రెట్టింపు అవుతుంది. KVP పథకం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోస్టాఫీసుల్లో, దేశంలోని ప్రధాన బ్యాంకుల్లో అందుబాటులో ఉంది. మీకు కావాలంటే మీరు ఈ పథకాన్ని పోస్టాఫీసులో లేదా బ్యాంకుల్లో కూడా ప్రారంభించవచ్చు.
కిసాన్ వికాస్ పత్ర మెచ్యూరిటీ వ్యవధి 124 నెలలు. ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 1000. గరిష్ట పరిమితి లేదు. మీకు కావలసినంత డిపాజిట్ చేయవచ్చు. దీని ప్రకారం రిటర్న్స్ కూడా తీసుకోవచ్చు. ఈ పథకం ప్రధానంగా రైతులు, తక్కువ ఆదాయ ప్రజల కోసం రూపొందించారు. తద్వారా వారు దీర్ఘకాలంలో తమ డబ్బును ఆదా చేసుకోవచ్చు. 2021 మొదటి త్రైమాసికంలో, KVPకి వడ్డీ రేటు 6.9 శాతంగా నిర్ణయించారు. మీరు రూ.5 లక్షలు లంప్సమ్లో పెట్టుబడి పెడితే మెచ్యూరిటీపై రూ.10 లక్షలు పొందుతారు.
ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ. 1,000. మీరు KVP లేదా కిసాన్ వికాస్ పాత్రను సర్టిఫికేట్ రూపంలో పొందుతారు. దీనిలో రూ. 1,000, 2,000, 5,000, 10,000, 50,000 వరకు సర్టిఫికేట్లు ఉంటాయి. ఇందులో మీరు ప్రభుత్వం నుంచి హామీని పొందుతారు. సర్టిఫికేట్ జారీ సమయంలో వడ్డీ రేటు నిర్ణియిస్తారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందులో మార్పులు ఉండవచ్చు. ముగ్గురు వ్యక్తులు కలిసి ఖాతాను సింగిల్ లేదా జాయింట్లో తెరిచే అవకాశం ఉంటుంది.