బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, హీరోయిన్ తాప్సీ నివాసాలపై ఆదాయపన్ను శాఖ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముంబై, పుణె, ఢిల్లీ, హైదరాబాద్‌లోని మొత్తం 28 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఫాంటమ్ ఫిలిమ్స్ అనే ప్రొడక్షన్ హౌజ్ అక్రమాలకు కారణమని అధికారులు గుర్తించారు. కాగా ఐటీ దాడులపై తాప్సీ బాయ్‌ఫ్రెండ్ మాథియాస్ బో స్పందించాడు. సోషల్ మీడియా ద్వారా తాప్సీకి మద్దతుగా నిలిచాడు.
కొంతమంది గొప్ప అథ్లెట్లకు కోచ్‌గా నేను మొదటిసారిగా ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇటీవల తాప్సీ ఇళ్ళపై ఐటీ శాఖ దాడులు చేయడం ఆమె కుటుంబంపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తోంది. మంత్రి కిరెన్ రిజిజు దయచేసి ఏదైనా చేయండి అంటూ క్రీడా మంత్రి కిరెన్ రిజిజును ట్యాగ్ చేశాడు. మాథియాస్ ట్వీట్‌లోనే క్రీడా మంత్రి కిరెన్ రిజిజు ఘాటుగా సమాధానం ఇచ్చారు. చట్టం అత్యున్నతమైనది. దానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. ఈ విషయం నాకు, మీకు చెందినది కాదు. మేము మా వృత్తిపరమైన విధులకు కట్టుబడి ఉండాలి. అని రిప్లై ఇచ్చారు. డెన్మార్క్‌కు చెందిన మాథియాస్ బో తాజాగా భారతదేశ బ్యాడ్మింటన్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.