Kiren Rijiju: సీజేఐ చంద్రచూడ్‌కు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు లేఖ
Kiren Rijiju: కొలీజియం వ్యవస్థను తప్పుపట్టేలా ఇటీవల కిరణ్ రిజుజు కామెంట్స్
Kiren Rijiju: కొలీజియం వ్యవహారంలో కేంద్రం తన పంతం నెగ్గించుకునే దిశగా మరో పావును కదిపింది. కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ పంపించడం హాట్ టాపిక్ అయింది. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి రాజ్యాంగ ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలని కేంద్రమంత్రి లేఖలో కోరారు. న్యాయమూర్తుల నియామకం వ్యవహారంలో కొద్ది రోజులుగా కేంద్రం, సుప్రీంకోర్టు మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు కిరణ్ రిజుజు రాసిన లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కొలీజియం వ్యవస్థ రాజ్యాంగానికి అతీతమన్నట్లుగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కొండల్లా పేరుకుపోయిన కేసులకు కొలీజియం వ్యవస్థే కారణమన్నట్లుగా కిరణ్ రిజుజు చేసిన కామెంట్స్ కాక పుట్టించాయి. తాజాగా ప్రభుత్వ ప్రతినిధులకు కొలీజియంలో చోటు కల్పించాలంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి రాసిన లేఖ ప్రాధాన్యం సంతరించకుంది.