Darbhanga Blast: దర్భంగ ఎక్స్‌ప్రెస్‌ పేలుడు కేసులో కీలక విషయాలు

Darbhanga Blast: ఎంతమంది చస్తే అంత డబ్బు.. రైలును పేల్చితే రూ.కోటి * అంచనా కంటే ఎక్కువమంది చనిపోతే మరింత రివార్డు

Update: 2021-07-05 03:15 GMT

దర్బంగా బ్లాస్ట్ (ఫైల్ ఇమేజ్)

Darbhanga Blast: దర్భంగ ఎక్స్‌ప్రెస్‌ పేలుడు కేసు నిందితుల విచారణలో కీలక విషయాలను రాబట్టింది ఎన్‌ఐఏ. ఈ కేసులో కీలక నిందితుడు నాసిర్‌ మాలిక్‌.. 2012లో పాకిస్తాన్‌కు వెళ్లాడు. అక్కడ.. లష్కరే నాయకులను కలిసి, నాలుగు నెలల పాటు.. ముడి పదార్థాలతో ఐఈడీ తయారీలో శిక్షణ పొందాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. నాసిర్‌ను నిలదీయగా.. తాను రా ఏజెంట్‌నని, ఓ ఆపరేషన్‌లో భాగంగా పాక్‌కు వెళ్లినట్టు తల్లిదండ్రులను నమ్మించినట్టు దర్యాప్తులో తేలింది.

ఇమ్రాన్‌, నాసిర్‌ మాలిక్‌ సోదరులకు లష్కరే తోయిబా భారీ ఆఫర్‌ ప్రకటించింది. తలకో లెక్క.. ఎంతమంది చస్తే అంత డబ్బు.. ఒకవేళ రైలును పేల్చితే కోటి రూపాయలు.. ఇది మాలిక్‌ సోదరుల ప్యాకేజీ. ఒక్క పేలుడులో అంచనా కంటే ఎక్కువమంది చనిపోతే.. ముందుగా అనుకున్న ప్యాకేజీ కంటే మరింత రివార్డు ఇచ్చేలా లష్కరే అగ్రనేతలతో మాలిక్‌ సోదరులు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇందులో భాగంగానే.. మాలిక్‌ సోదరులు ముందుగా.. దర్భంగ ఎక్స్‌ప్రెస్‌లో రసాయన బాంబు పెట్టారు. అది సక్సెస్‌ అయిఉంటే.. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్రలు పన్నినట్టు ఎన్‌ఐఏ విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. అయితే.. వారి పథకం ప్రకారం దర్భంగ ఎక్స్‌ప్రెస్‌లో పేలుడు జరిగి ఉంటే.. వీరికి భారీ మొత్తంలో డబ్బు అంది ఉండేది. అయితే.. ఇంతలోనే వీరిని అరెస్టు చేయడంతో.. భారీ కుట్రలను ముందుగానే భగ్నం చేసినట్లయింది. మరోవైపు.. సలీం అనే వ్యక్తి ద్వారా.. మాలిక్‌ సోదరులకు హవాలా మార్గంలో లక్షన్నర అందినట్టు అధికారులు గుర్తించారు. 

Tags:    

Similar News