Youtuber Couple: యూట్యూబ్‌లో లాస్ట్ వీడియో పోస్ట్ చేసి చనిపోయిన జంట.. అందులో ఏముంది?

Update: 2024-10-27 16:14 GMT

Sellu Family Youtuber Couple Died: భార్యభర్తలు ఇద్దరూ సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. గత మూడున్నరేళ్లుగా వీళ్లు ఛానెల్ రన్ చేస్తున్నారు. ఇప్పటికే 1486 వీడియోలు చేశారు. వారికి 18,400 మంది సబ్ స్క్రైబర్స్ కూడా ఉన్నారు. ఇంతలోనే ఏమైందో ఏమో తెలియదు కానీ ఉన్నట్లుండి ఆదివారం ఆ జంట శవమై కనిపించింది.

సొంతంగా యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తోన్న ఓ జంట ఉన్నట్లుండి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన ఘటన కేరళలోని పరశ్శాలలో చోటుచేసుకుంది. రోజూ ఇంట్లో సందడి చేస్తూ కనిపించే ఆ జంట గత రెండు రోజులుగా కనిపించడం లేదని అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చూసేటప్పటికే వారు చనిపోయి ఉన్నారు.

భర్త పేరు సెల్వరాజ్. వయస్సు 45 ఏళ్లు. భార్య పేరు ప్రియ. ఆమె వయస్సు 40 ఏళ్లు. సెల్వరాజ్ ఇంట్లో ఉరేసుకుని కనిపించగా, బెడ్ పై ప్రియ శవం లభించింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వారు ఆత్మహత్య చేసుకుని ఉంటారు అని అనుమానిస్తున్నారు. మృతదేహాలు ఉబ్బిన తీరు చూస్తోంటే వారు చనిపోయి రెండు రోజులు అయ్యుంటుందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

Full View

సెల్వరాజ్, ప్రియ ఇద్దరూ కలిసి సెల్లు ఫ్యామిలీ అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. శుక్రవారం కూడా వీళ్లు తమ యూట్యూబ్ ఛానెల్లో 55 సెకన్ల నిడివితో ఒక వీడియో పోస్ట్ చేశారు. తమ ఫోటోలను స్లైడ్ షోగా పెట్టి ఆ వీడియోను రూపొందించారు. సెల్లు ఫ్యామిలీ యూట్యూబర్స్ చనిపోయారన్న వార్తతో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. చనిపోయే ముందుగా పెట్టిన చివరి వీడియో కావడంతో అందులో ఏముందా అని నెటిజెన్స్ సెల్లు ఫ్యామిలీ యూట్యూబ్ ఛానెల్ వెతికి మరీ చూస్తున్నారు. ఛానెల్ సబ్‌స్క్రైబర్స్, నెటిజెన్స్ ఆ వీడియో కింద కామెంట్స్ పెడుతూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.  

Tags:    

Similar News