వైరల్‌ అయిన ప్రీ వెడ్డింగ్ షూట్.. కేరళ ప్రభుత్వం పరువు గంగలో కలిసిపోయిందని..

Kerala: పెళ్లంటే.. బాజా భజంత్రీలు, బంధువుల సందడులు, మూడు ముళ్లు, ఏడడుగులు అంతేకదా.

Update: 2022-09-22 05:59 GMT

వైరల్‌ అయిన ప్రీ వెడ్డింగ్ షూట్.. కేరళ ప్రభుత్వం పరువు గంగలో కలిసిపోయిందని..

Kerala: పెళ్లంటే.. బాజా భజంత్రీలు, బంధువుల సందడులు, మూడు ముళ్లు, ఏడడుగులు అంతేకదా. ఎవరి పెళ్లైనా ఇంతే. కానీ అలా కామన్‌గా కొత్త జీవితంలోకి అడుగుపెడితే చెప్పుకోడానికి ఏముంటుంది..? కాస్త ఎక్స్‌ట్రా టచ్ ఇచ్చిందో పెళ్లి కూతురు. తన మ్యారేజ్‌కు సామాజిక కోణాన్ని యాడ్ చేసింది. ఓ చిన్న ఫోటో షూట్‌తో.. ఓవర్ నైట్ ఇండియా వైడ్‌గా సెలబ్రిటీ అయిపోయింది. ఆమె చేసిన పనికి నెటిజెన్స్‌ ఎంతలా రియాక్ట్‌ అయ్యారంటే ఒక్కటంటే ఒక్క నెగటీవ్ కామెంట్ లేదు. ఇంతకీ ఆమే చేసిందేంటి..? ఆమె ఎత్తుకున్న సామాజిక బాధ్యత ఏంటి..?

ప్రీ వెడ్డింగ్ షూట్ చాలా ఖరీదైన అంశం. లక్షలు పెట్టాల్సిందే. కొత్త కొత్త లొకేషన్లను ఎంచుకుంటారు. ఖర్చు పెట్టే సత్తా ఉంటే విదేశాల్లో కూడా షూటింగ్ చేస్తారు. ట్రెండింగ్‌కు తగ్గట్లు క్యాస్టూమ్స్ ఉంటాయి. ఇలా చాలా రిచ్‌గా కనిపించేందుకు ఇష్టపడతారు. అన్నీ కలిపితే ఓ చిన్నపాటి సినిమా అవుతుంది. ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్‌కే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు వెరీ కామన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ప్రతీ జంట తమ పెళ్లికి ముందు ఈ ముచ్చట కూడా తీర్చుకునేందుకు పోటీ పడుతోంది.

అయితే కేరళకు చెందిన ఓ అమ్మాయి తన పెళ్లికి ముందు చేసిన షూట్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. ఎర్ర రంగు చీర కట్టుకుని ఒంటినిండా నగలు పెట్టుకుని, పెళ్లికూతురుగా ముస్తాబై డైరెక్ట్‌గా రోడ్డుమీదకొచ్చి నడుస్తుండగా ఓ కెమెరామెన్‌ ఫోటోస్ తీస్తున్నాడు. గుంతలు పడి వర్షం నీరు నిలిచిన రోడ్డుపై ఆమె అలా నవ్వుకుంటూ ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది. కాసేపట్లో పెళ్లి ఉందనగా కళ్యాణమండపం దగ్గరే ఉన్న రోడ్డుపై ఇలా షూట్ చేయాలని సదరు పెళ్లి కూతురు కోరిందట. అందుకే ఫోటోగ్రాఫర్ ఆమెనలా కెమెరాలో బంధించాడు.

ఆమె ఫోటోలు, వీడియోను ఆరో వెడ్డింగ్ కంపెనీ అనే సంస్థ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ప్రీ వెడ్డింగ్ వీడియో ఓవరాల్ ఇండియాలో వైరల్ అయిపోయింది. ఓవర్ నైట్‌లోనే టాక్‌ ఆఫ్‌ ది నెటిజెన్స్‌గా మారిపోయింది. అప్‌లోడ్ అయిన కొన్ని గంటల్లోనే 50 లక్షలకు పైగా వ్యూస్ రావడమే కాదు వాటి సంఖ్య గంట గంటకూ పెరగుతూ వస్తోంది. అంతే స్కోర్‌తో లైక్స్ ‌కూడా వస్తున్నాయి. ఇక నెటిజెన్స్‌ కామెంట్స్‌కు కొదువ లేదు. అమ్మాయి క్రియేటివిటీకి ఫిదా అయిపోయారు. ఈ ఒక్క షూట్‌తో కేరళ ప్రభుత్వం పరువు గంగలో కలిసిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి కూతురు దెబ్బకు.. ప్రభుత్వ అధికారులు కళ్లు తెరుచుకుంటాయంటూ.. అమె చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. కేరళ సర్కార్ నిద్ర పోతుందని కొందరు అసలు కేరళలో ప్రభుత్వం ఉందా..? లేదా..? అంటూ మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా రోడ్లపై పడిన గుంతల్లో హ్యాపీగా చేపలు పెంచుకోవచ్చంటూ కామెంట్స్ చేస్తున్నారు. మంచి లాభాలు కూడా వస్తాయంటూ ఎవరి దగ్గర అనుమతి తీసుకోవాలో తెలియడం లేదంటూ సెటైరిక్‌గా స్పందిస్తున్నారు. కొత్త పెళ్లికూతురు క్రియేటివిటీతో ఆ రోడ్లు బాగుపడుతాయని కొందరు పాజిటివ్‌గా కామెంట్లు పెడుతున్నారు.

ఇలా తన పెళ్లికి, సామాజిక సమస్యను జత చేయడం నిజంగా అభినందనీయం. ఆ ఆలోచన చేసిన వారెవరైనా అందుకు వారు అర్హులే. వాస్తవానికి ఒకప్పట్లా లేరు ఇప్పటి అమ్మాయిలు. ప్రతీ దాంట్లో తమ మార్క్‌ను చూపుతున్నారు. క్రియెటివిటీని ప్రదర్శించడంలో ఎక్కడా వెనకాడటం లేదు. అందుకే ఇన్‌స్టా రీల్స్‌లో కానీ.. యూ ట్యూబ్‌ వీడియోస్‌ లో కానీ.. తమకు నచ్చిన వీడియోస్‌ను షేర్ చేసుకుంటున్నారు. ఆ మధ్య తమిళనాడుకు చెందిన ఓ యువతి ఇలాగే తన ప్రీ వెడ్డింగ్ షూట్‌ను.. ఓ జిమ్‌లో తీయించుకుంది. అది కూడా వైరల్ అయ్యింది. మూడు ముళ్లు వేసుకుని చక్కగా కాపురం చేసుకోవాల్సిన అమ్మాయికి ఈ వర్కౌట్స్ ఏంటనే ఆలోచన లేకుండా డంబెల్స్‌ ఎత్తుతూ కండలు పెంచేందుకు ప్రయత్నించింది. ఈ అమ్మాయి చేసిన ప్రయత్నాన్ని కూడా నెటిజెన్స్‌ ప్రశంసలతో ముంచెత్తారు. అత్తింటి వారికి వార్నింగ్‌ ఇస్తున్నారా అని భర్త పని అయిపోయిందని ఇక చుక్కలు చూపెడుతుందంటూ రకరకాలుగా సరదాగా కామెంట్స్ చేశారు. 


Tags:    

Similar News