కేరళలో ముదురుతున్న 'చీరకట్టు' వివాదం.. స్పందించిన విద్యాశాఖ మంత్రి..

Kerala: చీర కట్టుకొనే స్కూళ్లకు రావాలంటూ యాజమాన్యాలు విధిస్తున్న ఆంక్షలు కేరళలో వివాదాస్పదం అవుతున్నాయి.

Update: 2021-11-14 12:46 GMT

కేరళలో ముదురుతున్న ‘చీరకట్టు’ వివాదం.. స్పందించిన విద్యాశాఖ మంత్రి..

Kerala: చీర కట్టుకొనే స్కూళ్లకు రావాలంటూ యాజమాన్యాలు విధిస్తున్న ఆంక్షలు కేరళలో వివాదాస్పదం అవుతున్నాయి. దీనిపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ దుస్తులపై ఇలాంటి ఆంక్షలేంటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆర్. బిందు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు.

ఆంక్షలపై ఆమె స్పందించారు. ఏ వస్త్రాలు ధరించాలన్నది టీచర్ల వ్యక్తిగత అభిప్రాయమని, చీరలే కట్టుకుని రావాలనడానికి స్కూళ్ల యాజమాన్యాలకు హక్కు ఏముందని, 'అసలు మీరెవరు ఆదేశించడానికి?' అంటూ ఆమె మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే తన వైఖరిని చెప్పిందని స్పష్టం చేశారు. ఇటు రాష్ట్ర విద్యాశాఖ కూడా వస్త్రధారణపై సర్క్యులర్ ను జారీ చేసింది. టీచర్లు తమకు నచ్చిన దుస్తులను వేసుకుని స్కూలుకు వెళ్లొచ్చని స్పష్టం చేసింది.

Tags:    

Similar News