Kerala: వ్యాక్సిన్ల వృధాను సమర్థవంతంగా అరికడుతున్న కేరళ

Kerala: కొవిడ్ వ్యాక్సీన్లను సమర్థవంతంగా వినియోగిస్తూ, వృధాను అరికడుతున్న కేరళ నర్సులు, వైద్య సిబ్బందిపై ప్రధానమంత్రి ప్రశంసలు కురిపించారు.

Update: 2021-05-06 07:12 GMT

Kerala: వ్యాక్సిన్ల వృధాను సమర్థవంతంగా అరికడుతున్న కేరళ

Kerala: కొవిడ్ వ్యాక్సీన్లను సమర్థవంతంగా వినియోగిస్తూ, వృధాను అరికడుతున్న కేరళ నర్సులు, వైద్య సిబ్బందిపై ప్రధానమంత్రి ప్రశంసలు కురిపించారు. దేశవ్యాప్తంగా మూడోదశ వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోడీ ట్విటర్లో స్పందిస్తూ.. కొవిడ్-19పై పోరాటాన్ని బలోపేతం చేసేందుకు వ్యాక్సీన్ వృధాను అరికట్టడం చాలా ముఖ్యం అని పేర్కొన్నారు. తన సందేశంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పోస్టును ప్రధాని రీట్వీట్ చేశారు.

ఇప్పటి వరకు కేంద్రం నుంచి కేరళకు అందిన వ్యాక్సిన్‌ డోసుల గురించి విజయన్‌ అందులో పేర్కొన్నారు. ప్రతి వెయిల్‌లోనూ వృధా కింద ఒక డోసు అదనంగా ఉంటుందనీ దాన్ని కూడా ఉపయోగించి తమ హెల్త్ వర్కర్లు అత్యంత సమర్థంగా పనిచేస్తున్నారని విజయన్‌ తెలిపారు. హెల్త్‌ వర్కర్లు, నర్సులకు కేరళ సీఎం ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కేరళలోనే వ్యాక్సిన్‌ల వృథా అత్యంత తక్కువ శాతం ఉంది. అందుకే ప్రధాని కూడా విజయన్‌ పోస్ట్‌ను రీ ట్వీట్‌ చేశారు.

Tags:    

Similar News