Arvind Kejriwal: మధ్యంత బెయిల్ విషయంలో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
Arvind Kejriwal: అనారోగ్య కారణంగా మరో 7 రోజుల మధ్యంతర బెయిల్ కోరిన కేజ్రీవాల్
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంత బెయిల్ విషయంలో ఊరట దక్కలేదు. మధ్యంతర బెయిల్‌ను మరోసారి పొడిగించాలంటూ ఆయన పెట్టుకున్న అభ్యర్థనను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. అనారోగ్య పరిస్థితుల కారణంగా వైద్య పరీక్షల నిమిత్తం తనకు మరో 7 రోజులు మధ్యంతర బెయిల్ కోరుతూ కేజ్రీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన స్పెషల్ కోర్టు.. బెయిల్ పిటిషన్‌ను కొట్టేసింది. వైద్య పరీక్షలను తీహార్ జైల్లోనే నిర్వహించాల్సిందిగా అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేజ్రీ జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులకు పొడిగించింది. జూన్ 19 వరకూ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది.