ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాల మూసివేత

నిన్న ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, రెండు ఆలయాల గేట్లకు తాళాలు వేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్రసింగ్‌ రావత్‌ పాల్గొన్నారు.

Update: 2020-11-17 04:23 GMT

భారీగా మంచుకురుస్తుండడంతో ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌, యమునోత్రి ఆలయాలను మూసివేశారు. నిన్న ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, రెండు ఆలయాల గేట్లకు తాళాలు వేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్రసింగ్‌ రావత్‌ పాల్గొన్నారు. కేదార్‌నాథ్‌లో మంచువల్ల హెలికాప్టర్‌ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. దీంతో ఇద్దరు సీఎంలు కొన్ని గంటలపాటు ఆలయంలోనే ఉండాల్సి వచ్చింది. ఇక గంగోత్రిలో ఆదివారం నుంచే దర్శనాలు నిలిపివేశారు. ఇదిలా ఉండగా జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై పెద్దఎత్తున మంచు పేరుకుపోవడంతో ఆ దారిని మూసివేశారు.

Tags:    

Similar News