Karnatakaలో లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు
Karnataka:రోడ్లపైకి వచ్చిన జనం మాస్క్‌లు, భౌతికదూరం మానేసిన ప్రజలు
Karnataka: కరోనా మహమ్మారి కట్టడి కోసం కర్ణాటకలో రాష్ట్రవ్యాప్తంగా వీకెండ్ కర్ఫ్యూ కొనసాగుతున్నది. శుక్రవారం రాత్రి 9గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. అయితే శని, ఆదివారాల్లో ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు రోజూ నాలుగేసి గంటల చొప్పున కర్ఫ్యూ వేళల్లో సడలిపు ఇచ్చారు.
ఆదివారం కర్ఫ్యూ సడలింపు వేళల్లో కిరాణ దుకాణాలు, ఇతర నిత్యావసర దుకాణాల ముందు జనం బారులు తీరారు.. శనివారం ఉదయం 10గంటల తర్వాత వెలవెలబోయిన వీధులు ఈ ఉదయం ఒక్కసారిగా కళకళలాడాయి.. ఉదయం 10 తర్వాత మళ్లీ ఎప్పటిలాగే వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. శివమొగ్గలో కర్ఫ్యూ సడలింపు వేళల్లో నిత్యావసరాల కోసం జనం రోడ్ల మీదకు వచ్చారు.