మహేంద్రా షోరూమ్‌లో రైతుకు అవమానం.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రైతు..
Mahindra showroom: అదొక పెద్ద షోరూమ్.. అక్కడికి ఓ రైతు వెళ్లాడు తనకు ఓ ట్రాలీ ట్రక్ కావాలన్నాడు.
Mahindra showroom: అదొక పెద్ద షోరూమ్.. అక్కడికి ఓ రైతు వెళ్లాడు తనకు ఓ ట్రాలీ ట్రక్ కావాలన్నాడు... ఆ రైతు వేషధారణ చూసి.. సేల్స్ అతడిని పైనుంచి కిందికి చూశాడు. అసలు నీ దగ్గర కనీసం పది రూపాయలు అయినా ఉన్నాయా? అంటూ వెటకారకంగా మాట్లాడుతూ.. ఆ రైతును అవమానించాడు. గంటలో నేను అడిగిన ట్రక్ రెడీ చేయ్.. కొనకపోతే అప్పుడు మాట్లాడంటూ.. రైతు చాలెంజ్ విసిరాడు.. అనుకున్నట్టే గంటలో డబ్బు కట్టాడు.
ఇదంతా ఏదో సినిమాలోని సన్నివేశమనుకుంటే పప్పులో కాలేజినట్టే.. ఇది నిజంగానే జరిగింది. కర్ణాటకలోని తుముకూరులో మహేంద్ర షోరూమ్‌లో రెండ్రోజుల క్రితం జరిగింది. కెంపేగౌడ అనే రైతు మహేంద్ర షోరూమ్‌కు వెళ్లాడు. తనకు బొలేరో ట్రక్ కావాలని దాని ధర చెప్పమంటూ కెంపేగౌడ సెల్స్‌మ్యాన్‌ను అడిగాడు. అసలు నీది ట్రక్ కొనే మొహమనేనా? అంటూ కెంపేగౌడను అవమానించాడు. దీంతో సెల్స్‌మ్యానతో కెంపేగౌడ వాగ్వాదానికి దిగాడు.
అక్కడి నుంచి వెళ్లిపోయి గంటలో 10 లక్షల రూపాయలతో కెంపేగౌడ తిరిగి షోరూమ్‌కు వచ్చాడు. పది లక్షల రూపాయలు చూపించి సేల్స్‌మ్యాన్‌ను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. చివరికి సేల్స్‌మ్యాన్ సారీ చెప్పాడు. అయితే ఇలాంటి షోరూమ్‌లో తాను వాహనాన్ని కొనుగోలు చేయనని తన డబ్బుతో కెంపేగౌడ వెళ్లిపోయాడు. ఇప్పుడు మహేంద్ర షోరూమ్‌లో జరిగిన గొడవ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేషధారణ చూసి మనిషిని అంచనా వేయొద్దంటూ సేల్స్‌మ్యాన్ తీరుపై నెటిజన్లను మండిపడుతున్నారు.