Rumors on Lockdown Extension: వదంతులు నమ్మొద్దు.. లాక్‌డౌన్ పొడిగింపు లేదు
Rumors on Lockdown Extension: రాజధాని నగరం బెంగళూరుతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకటించిన లాక్‌డౌన్‌ను మరింత విస్తరించబోమని కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప శుక్రవారం మరోసారి పునరుద్ఘాటించారు.
Rumors on Lockdown Extension: రాజధాని నగరం బెంగళూరుతో సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రకటించిన లాక్‌డౌన్‌ను మరింత విస్తరించబోమని కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప శుక్రవారం మరోసారి పునరుద్ఘాటించారు. బెంగళూరులో ఎంపీలు, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సిఎం మాట్లాడుతూ, లాక్డౌన్ కోవిడ్ -19 కు పరిష్కారం కాదు. లాక్‌డౌన్‌ను మరింత విస్తరించము. అని అన్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈనెల 23వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు మాత్రమే లాక్ డౌన్ ఉంటుందని అన్నారు. అయితే లాక్‌డౌన్ పొడిగిస్తారని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని అన్నారు. కర్ణాటక కోవిడ్ -19 టాస్క్‌ఫోర్స్‌తో సమావేశమైన తర్వాత ఈ వారం ప్రారంభంలో కూడా యెడియురప్ప ఇదే విషయాన్ని చెప్పారు.
ఇక కరోనా వైరస్ సోకిన వారిని ఆస్పత్రుల్లో చేర్పించడానికి సంబంధించిన అన్ని అడ్డంకులను తొలగించాలని యెడియరప్ప బెంగళూరులోని ఎనిమిది మండలాల్లోని ఇన్‌ఛార్జి మంత్రులను ఆదేశించారు. గత వారంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల నేపథ్యంలో జూలై 14 సాయంత్రం నుంచి జూలై 22 వరకు బెంగళూరు పట్టణ, గ్రామీణ జిల్లాల్లో పూర్తి లాక్డౌన్ అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. దక్షిణ కన్నడ, ధార్వాడ్, మరియు కలబురగితో సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు కూడా ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉన్నాయి. ఇదిలావుండగా మహమ్మారికి సంబంధించిన తాజా కేసుల సంఖ్య (4,169), మరణాలు (104)గా ఉంది. గురువారం రాష్ట్రంలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.