మామిడి చెట్టుకు కాసిన కోటి రూపాయలు.. స్వాధీనం చేసుకున్న అధికారులు..!

Karnataka Election 2023: కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10న పోలింగ్ జరగనుంది. అధికార బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మూడు పార్టీలు సై అంటే సై అంటున్నాయి.

Update: 2023-05-03 10:43 GMT

మామిడి చెట్టుకు కాసిన కోటి రూపాయలు.. స్వాధీనం చేసుకున్న అధికారులు..!

Karnataka Election 2023: కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10న పోలింగ్ జరగనుంది. అధికార బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మూడు పార్టీలు సై అంటే సై అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు పోటీపడుతూ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కోట్ల కొద్దీ డబ్బులు చేతులు మారుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో కోట్లకొద్దీ డబ్బు పట్టుబడుతోంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో రూ.302 కోట్లను ఐటీ అధికారులు సీజ్ చేశారు. కేవలం బెంగళూరులోనే రూ.82 కోట్లు పట్టుబడ్డాయి.

ఇక తాజాగా పుత్తూరు కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్ సోదరుడు సుబ్రహ్మణయ్య రాయ్ ఇంటిపై రైడ్ చేయగా అధికారులకు అవాక్కయ్యారు. సుబ్రహ్మణయ్య ఇంటిపై దాడి చేయగా డబ్బులు దొరకలేదు. అయితే ఇంటి ఆవరణలో ఉన్న మామిడి చెట్టును పరిశీలించగా చెట్టు కొమ్మల్లో ఓ బ్యాగు వేలాడుతూ కనిపించింది. అనుమానం వచ్చి ఆ బ్యాగును చెట్టు పై నుంచి దించి చూడగా ఐటీ అధికారులు విస్తుపోవాల్సి వచ్చింది. ఆ బ్యాగులో కోటి రూపాయలకు పైగా నగదు బయటపడింది.

ఎన్నికలు దగ్గర పడడంతో కర్ణాటకలో ధన ప్రభావం తీవ్రంగా పెరిగింది. 2018 ఎన్నికలకు 10 రోజుల ముందు వరకు అధికారులు రూ. 115.91 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక తాజాగా పట్టుబడిన నగదు రెండురెట్లు అధికంగా ఉంది. మరోవైపు ఎన్నికల్లో నిఘాను ఈసీ తీవ్ర తరం చేసింది. 2040 ఫ్లయింగ్ స్క్వాడ్ లు, 2605 పరిశీలన బృందాలు, 266 వీడియో పరిశీలన బృందాలు, 631 వీడియో నిఘా బృందాలు, 225 అకౌంటింగ్ బృందాలను ఎన్నికల కోసం ఏర్పాటు చేసింది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా 942 చెక్ పోస్టులను నిర్వహిస్తోంది.


Tags:    

Similar News