Karnataka Election Results 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్‌ అప్‌డేట్స్‌

Karnataka Election Results 2023: కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం

Update: 2023-05-13 01:45 GMT

Karnataka Election Results 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్‌ అప్‌డేట్స్‌

Karnataka Election Results 2023: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం కన్నడిగులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడునుండటంతో కర్ణాటక మొత్తం ముందు జాగ్రత్తలో భాగంగా నిషేదాజ్ఞలు విదిస్తున్నామని-పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.ఇళ్లల్లో, రిసార్టుల్లో సేద తీరుతున్న పలు పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు విజయం మాదే అంటూ ధీమాగా ఎంజాయ్ చేస్తున్నారు.

పోలింగ్ కేందాల్లో వివిద పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు స్వతంత్ర పార్టీ అభ్యర్థులు ఎలాంటి హంగామా చెయ్యకుండా పోలీసు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు ఎవరైనా నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.

బెంగళూరు నగరంలోని అన్ని ప్రాంతాల్లో బాణాసంచా కాల్చడం, ఊరేగింపులు చెయ్యడం, ధర్నాలు, ర్యాలీలు చెయ్యడం నిషేధించామని బెంగళూరు పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు

బెంగళూరు నగరంతో సహ కర్ణాటకలోని పలు సున్నితమైన ప్రాంతాల్లో పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎవ్వరూ గుమికూడకూడదని పోలీసు అధికారులు హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల దగ్గర నుంచి విజయం సాధించిన అభ్యర్థులు ర్యాలీగా అక్కడి నుంచి బయలుదేరడానికి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు.

రాష్ట్ర వ్యాప్తం గా 34 కౌంటింగ్ కేంద్రాలు. ఏర్పాటు చేశారు.

కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది.కర్ణాటకలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని, కర్ణాటకలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వానికి ఎక్కువ చాన్స్ లు ఉన్నాయని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి,

కర్ణాటకలో కింగ్ మేకర్ గా అవతరిస్తున్న జేడీఎస్ దళపతి హెచ్ డీ. కుమారస్వామి ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 73శాతం పోలింగ్ నమోదు అయింది. గత0 లో ఎన్నడు లేని విధం గా పోలింగ్ ఈసారి రికార్డ్ స్థాయి లో నమోదు అయింది.అత్యధికం గా చికబల్లపుర్ నియోజకవర్గ లో 85శాతం నమోదు అయింది.

రాష్ట్ర వ్యాప్తం గా 34 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొదటి రౌండ్ 8 కి మొదలవుతుంది. 9 గంటలకు ఫలితం తెలుస్తుంది.

బెంగళూరు లో 4 కేంద్రాలు మిగితా జిలల్లు అన్ని 30 సెంటర్లు గా ఉన్నాయి.

Tags:    

Similar News