Rahul Gandhi-Kamala Harris: కమలా హారిస్-రాహుల్ గాంధీ ఫోన్ కాల్ నిజం కాదట..
Rahul Gandhi-Kamala Harris: వచ్చిన వార్తలపై స్పందించిన వైస్ ప్రెసిడెంట్ కార్యాలయం
Rahul Gandhi-Kamala Harris: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ... అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు వచ్చిన వార్తలను ఆమె కార్యాలయం ఖండించింది. అవన్నీ అవాస్తవమని కొట్టిపారేసినట్లు అమెరికా జర్నలిస్టు వెల్లడించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని వైస్ ప్రెసిడెంట్ కార్యాలయం ధృవీకరించింది. రాహుల్ గాంధీతో కమలా హారిస్ మాట్లాడలేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గురువారం సాయంత్రం వీరిద్దరి మధ్య సంభాషణ జరిగినట్లు పలు కథనాలు వచ్చాయి. ఈ ఏడాది చివర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నవేళ ఈ వార్తలకు ప్రాధాన్యం ఏర్పడింది.