KA Paul about Coronavirus Spread: నేను చెప్పినట్టే జరుగుతోంది... అయినా పట్టించుకోవడం లేదు
KA Paul about Coronavirus Spread: మనకి గత ఎన్నికల్లో హాయిగా నవ్వుకునేలా రిలీఫ్ ఇచ్చిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మరో సందేశాన్ని పంపాడు.
KA Paul about Coronavirus Spread: మనకి గత ఎన్నికల్లో హాయిగా నవ్వుకునేలా రిలీఫ్ ఇచ్చిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ మరో సందేశాన్ని పంపాడు. తాను చెప్పినట్టే కరోనా విషయంలో జరుగుతుందని, అయితే అవసరాన్ని బట్టి, కిట్లు పంపించేందుకు లెటర్ ఇవ్వాలంటూ రెండు తెలుగు రాష్ట్రాలను అడిగినా స్పందించలేదని ఆయన చెబుతున్నాడు.
లక్షలు, కోట్లమంది కరోనా కారణంగా చనిపోతారని చెప్పినట్లే జరుగుతోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ అన్నారు. ఎవడో ఎవడిపైనో సినిమాలు తీస్తున్నాడన్న ప్రచారం మాని… వెంటనే సీరియస్ గా తీసుకోవాలన్నారు. ఇన్నాళ్లు మాస్క్ వద్దన్న మెంటలోడు ట్రంప్ ఆరు నెలల తర్వాత మాస్క్ పెట్టుకోవాలంటున్నాడని ఆరోపించారు. కరోనా వైరస్ డేంజర్, ఆసుపత్రులను రెడీ చేయండి అని 5 నెలల క్రితమే చెప్పినా తెలుగు రాష్ట్రాల సీఎంలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వినిపించుకోలేదని ఇప్పుడదే నిజం అయ్యిందని ఆరోపించారు.
ఏపీ, తెలంగాణలలో నేతలు, ప్రజా ప్రతినిధులకు డబ్బు ఉండటంతో లక్షలు పెట్టి ప్రైవేటులో చికిత్స పొంది బ్రతుకుతున్నారని… తినటానికే తిండిలేని వారు, రోజువారి కూలీ చేసుకొని బ్రతికే వారి పరిస్థితి ఏంటని పాల్ ప్రశ్నించారు. ఆరు నెలల పాటు పేదలకు రేషన్ ఇచ్చి మా ఛారిటీ ప్రదేశాలను వాడుకోమ్మంటే వినలేదని, ట్రంప్ ఎలా అయితే వదిలేశాడో తెలుగు రాష్ట్రాల సీఎంలు అదే చేశారన్నారు. దేశంలో తప్పుడు నివేదికలు ఇస్తున్నారు కానీ లక్షల మంది చనిపోతున్నారన్నారు.
న్యూయార్క్ గవర్నర్ నేనిచ్చిన సలహాలు అన్ని పాటించారని… ట్రంప్ ఎదేదో వాగుతాడు కానీ అసలు విషయాలు పట్టించుకోడన్నారు. సేవ్ అమెరికా ది వరల్డ్ ఫ్రం ట్రంప్ అని పుస్తకం రాస్తున్నాడని… తాను ఎలా గెలవాలి అన్నదే ట్రంప్, ఇండియా లీడర్లు ఆరాటపడుతారన్నారు. అందుకే గవర్నెన్స్ అంటే ఎంటో చూపిద్దామని అధికారం అడిగానన్నారు. చంద్రబాబు చేసిన అప్పలు 2.5లక్షల కోట్లయితే… జగన్ ఒక్క ఏడాదిలోనే 60వేల కోట్ల అప్పులు చేశాడన్నారు. టెస్టింగ్ కిట్స్ పంపిస్తానని, 7వేల కోట్లు పంపిస్తాం ఒక లెటర్ అడిగినా తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇవ్వలేదని పాల్ ఆరోపించారు.