Supreme Court: సుప్రీంకోర్టు తదుపరి సీజేగా జస్జిస్ సంజీవ్ ఖన్నా.. ఎవరీ సంజీవ్ ఖన్నా..?

Supreme Court: సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిగ్ గా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ ప్రతిపాదించారు.

Update: 2024-10-17 05:34 GMT

Supreme Court: సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిగ్ గా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ ప్రతిపాదించారు.

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమతులయ్యే ఛాన్స్ ఉంది. ఈ మేరకు తన తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ కేంద్రానికి ప్రతిపాదించారు. ఈ సిఫార్సులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లయితే సుప్రీంకోర్టు 51వ సీజేగా జస్టిస్ ఖన్నా నియమితులవుతారు.

నిబంధనల ప్రకారం..ఈ ప్రతిపాదనను ప్రస్తుత సీజేఐ లేఖ రూపంలో కేంద్ర న్యాయశాఖకు పంపిస్తారు. ఆ లేఖను కేంద్ర న్యాయశాఖ, ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపిస్తుంది. ఆయన ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి చేరుకుంటుంది. అంతిమంగా రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలను చేపడతారు.

సంప్రదాయం ప్రకారం సీజేఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టడానికి ముందు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేస్తారు. ఆ లెక్కన జస్టిస్ డి. వై. చంద్రచూడ్ తర్వాత జస్టిస్ ఖన్నా అత్యంత సీనియర్. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ పదవీకాలం ఈ ఏడాది నవంబర్ 11తో ముగుస్తుంది. ఆ మరుసటి రోజు అంటే నవంబర్ 12వ తేదీన జస్టిస్ ఖన్నా చీఫ్ జస్టిస్ గా బాధ్యతలను చేపట్టే ఛాన్స్ ఉంది. 6నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. వచ్చే ఏడాది మే 13వ తేదీన పదవీ విరమణ చేస్తారు.  

ఎవరీ సంజీవ్ ఖన్నా

సంజీవ్ ఖన్నా 1960 మే 14న న్యూదిల్లీలో జన్మించారు. ఆరు నెలలపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. 2025 మే 13న ఆయన రిటైరౌతారు. ప్రస్తుతం సీజేఐగా ఉన్న చంద్రచూడ్ 2022 నవంబర్ 22న సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ యుయు లలిత్ స్థానంలో ఆయన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. లా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 1983లో దిల్లీ బార్ కౌన్సిల్ లో పేరు నమోదు చేసుకున్నారు. తీస్ హజారీ కాంప్లెక్స్ లోని జల్లా కోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత దిల్లీ హైకోర్టు, ట్రిబ్యునల్ కోర్టులలో ప్రాక్టీస్ చేశారు. 2004 దిల్లీ నేషనల్ కేపిటల్ టెరిటోరి స్టాండింగ్ కౌన్సిల్, ఇన్ కమ్ ట్యాక్స్ స్టాండింగ్ సీనియర్ కౌన్సిల్ గా కొనసాగారు. దిల్లీ హైకోర్టులో క్రిమినల్ కేసుల్లో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, అమికస్ క్యూరీగా పనిచేశారు. 2005లో దిల్లీ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తి, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయనను నియమించారు.

Tags:    

Similar News