Covid 19 Vaccine: జాన్సన్ టీకాతో డెల్టా వైరస్ నుండి రక్షణ!

Covid 19 Vaccine: కరోనా డెల్టా రకం వైరస్ ను జాన్సన్ అండ్ జాన్సన్ టీకా సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు కంపెనీ తెలిపింది.

Update: 2021-07-02 07:23 GMT

Johnson & Johnson Vaccine

Covid 19 Vaccine: కరోనా మహమ్మారి రోజుకో రూపం దాల్చుతూ యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. సెకండ్ వేవ్ నుండి కొంత రిలాక్స్ అవుతున్న సమయంలో తాజా కరోనా డెల్టా రకం వైరస్ చాలా దేశాల్లో పంజా విసురుతోంది. ఈరకం వైరస్ ను అడ్డుకుంటున్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించింది. వైరస్‌ సంక్రమణ నుంచి విస్తృతమైన రక్షణ కల్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ టీకా వల్ల ఉత్పత్తయిన యాంటీబాడీలు డెల్టాతో పాటు ఇతర రకాలను సైతం తట్టుకోగలుతుందని గుర్తించామని తెలిపింది. దాదాపు ఎనిమిది నెలల పాటు మానవ శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తయినట్లు వెల్లడించింది.

తొలి డోసు తీసుకున్న 29 రోజుల్లోనే డెల్టా వేరియంట్‌ను నిర్వీర్యం చేసే యాంటీబాడీలు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాతో ఉత్పత్తి అయినట్లు సంస్థ పేర్కొంది. సమయం గడుస్తున్న కొద్ది వైరస్‌ను అడ్డుకునే సామర్థ్యం మరింత మెరుగైనట్లు వెల్లడించింది. ఇదిలావుంటే, తాజాగా తమ వ్యాక్సిన్ తీసుకున్నవారికి కీలక సూచన చేసింది. ఇప్పటికే తమ టీకా తీసుకున్నవారు ఏడాది తర్వాత బూస్టర్‌ డోసు తీసుకోవల్సి ఉంటుందని సంస్థ అధికారులు తెలిపారు. అయితే, అందుకోసం టీకా ఫార్ములాను మార్చాల్సిన అవసరమేమీ లేదని తెలిపారు. ఇప్పటి వరకు సింగిల్‌ డోసుగా ఉన్న టీకాను మరింత మెరుగైన ఫలితాల కోసం రెండు డోసుల్లో ఇవ్వడాన్ని కూడా పరీక్షిస్తున్నట్లు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ తెలిపింది.

Tags:    

Similar News