Johnson and Johnson: అందుబాటులోకి జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్
Johnson and Johnson: భారత్‌లో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ టీకాకు గ్రీన్ సిగ్నల్ పడింది.
Johnson and Johnson: భారత్‌లో జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ టీకాకు గ్రీన్ సిగ్నల్ పడింది. అత్యవసర వినియోగానికి సింగిల్ డోస్ టీకాకు కేంద్రం అనుమతినిచ్చింది. అత్యవసర వినియోగానికి ఈ నెల 5న జాన్సన్ అండ్ జాన్సన్ దరఖాస్తు చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్‌కు అత్యవసర వినియోగం కోసం ఆమోదం దక్కడంతో.. భారత్‌లో వినియోగించనున్న అయిదవ టీకా కానున్నది. యురోపియన్ యూనియన్ ఏజెన్సీ ఆమోదం పొందిన 5 టీకాలు మన వద్ద ఉన్నట్లు మంత్రి తన ట్విట్టర్‌లో తెలిపారు. జాన్సన్ సింగిల్ డోసు రాకతో.. కోవిడ్‌పై పోరాటం మరింత బలోపతం అవుతుందని మంత్రి చెప్పారు. దేశవ్యాప్తంగా కోవాగ్జిన్, కోవీషీల్డ్, స్పుత్నిక్, మోడెర్నా టీకాల అత్యవసర వినియోగానికి ఆమోదం దక్కిన విషయం తెలిసిందే.